విజయ్ తమిళనాడు రాజకీయాల్లోకి ఎంట్రీ ఇస్తున్నట్టు ఎప్పుడైతే అనౌన్స్ చేశారో అప్పటి నుండి ఆయనపై ఓ వర్గం వాళ్లు నెగిటివ్ కామెంట్లు చేస్తూనే ఉన్నారు. ముఖ్యంగా రాజకీయాల్లో రాణించాలంటే అవన్నీ ఓర్చుకోని నిలబడాలి.. అయితే రీసెంట్గా ఆయన కరూర్ లో ఒక పెద్ద బహిరంగ ర్యాలీ చేశారు. ఆ సమయం లో తొక్కిసలాట జరిగి 41 మంది చనిపోయారు. ఇంకొంత మంది తీవ్ర గాయాలపాలయ్యారు. అయితే ఇప్పటి వరకు బాధిత కుటుంబాలను విజయ్ కలవకపోయినప్పటికీ బాధిత కుటుంబాలకు డబ్బులు ఇచ్చి చేయూత అందించారు. ఇదంతా పక్కన పెడితే తాజాగా విజయ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు నటుడు రాజకీయ నాయకుడు అయినటువంటి నెపోలియన్. 

ఆయన తాజాగా ఓ ప్రైవేట్ మీడియా కి ఇచ్చిన ఛానల్ లో మాట్లాడుతూ.. విజయ్ ఏం గొప్ప చేశాడు ఏం సాధించాడని వై క్యాటగిరి భద్రత ను కల్పించారు. రాజకీయ నాయకుడి గా ఎదగాలంటే ప్రజల్లో తిరగాలి. ప్రజలతో నడవాలి. కానీ ఈయన స్పెషల్ విమానాల్లో ప్రయాణిస్తాడు. పుట్టుక తో అందరూ సమానమే అనే విషయం ముందుగా విజయ్ తెలుసుకోవాలి. రాజకీయాల్లో రాణించాలంటే ప్రజల్లో ఒకడిగా మెదలాలి. రాజకీయ నాయకులు అందరూ అలాగే ఉంటారు. కానీ విజయ్ అలా ఉండడం లేదు..

రాజకీయం అంటే సినిమాలలో లాగా పంచ్ డైలాగులు కొట్టడం కాదు.. అయినా విజయ్ ని ఎవరూ నమ్మడం లేదు.నేను మొన్నీ మధ్య అమెరికా వెళ్ళినప్పుడు ఆయన భార్య పిల్లల్ని కుటుంబాన్ని పట్టించుకోడు. ప్రజలను ఏం కాపాడతాడు అని తిడుతున్నారు. అయితే ఇవన్నీ విజయ్ మీద కోపం తో నేను మాట్లాడుతున్న మాటలు అయితే కాదు.నాకు విజయ్ కి గొడవలు ఉన్నాయి.అవి నిజమే. నేను ఆయన సినిమాలు చూడను. ఆయన్ని కలవడానికి వెళ్ళను. కానీ ఈ మాటలు మాత్రం కావాలని అనడం లేదు అంటూ నెపోలియన్ చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: