
రామ్ చరణ్ మాస్ లూక్ మరియు జాన్వి కపూర్ గ్లామర్ అదే విధంగా ఏఆర్ రెహమాన్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఇవన్ని కలిపి మూవీ పై విపరీతమైన బజ్ని క్రియేట్ చేశాయి . ఇక ముందుగా దసరా సందర్భంగా ఫస్ట్ సింగిల్ వస్తుందని వార్తలు వినిపించగా అది విడుదల కాకపోవడంతో అభిమానులు కొంత నిరాశ పడ్డారని చెప్పొచ్చు . అయితే ప్రెసెంట్ దర్శకుడు సానా బుచ్చి బాబు స్వయంగా మంచి వార్త చెప్పి ఫాన్స్ కి హుషారుని పెంచాడు . ఇటీవల జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ .. " త్వరలో ఒక లవ్ సాంగ్ ప్రేక్షకుల ముందుకు రానుంది .
ఆ పాటకు ఏఆర్ రెహమాన్ ఇచ్చిన మ్యూజిక్ అదిరిపోయేలా ఉంటుంది . ఇది మన హార్ట్ ను టచ్ చేసే మెలోడీగా నిలుస్తుంది " అంటూ బుచ్చిబాబు కామెంట్స్ చేశారు . ఇక ఈ కామెంట్స్ తో ప్రేక్షకులలో మంచి హైట్ ఏర్పడింది . మరి ఇది దివాలి గిఫ్ట్ గా వస్తుందా లేదా అనే ఆలోచనలు కూడా మొదలయ్యాయి . అయితే బుచ్చిబాబు మాత్రం రిలీజ్ డేట్ పై ఏమాత్రం క్లారిటీ ఇవ్వలేదు . ఈ మూవీ స్పోర్ట్ బ్యాక్ డ్రాప్ లో సాగే మాస్ మరియు ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందుతుంది .