దీపావళి, అంటే వెలుగుల పండుగ. ఈ పండుగ రోజున కొత్త వస్తువులు కొనడం శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవిని స్వాగతించడానికి, ఇంట్లో సిరిసంపదలు, సంతోషం నిలవాలని కోరుకుంటూ కొన్ని ప్రత్యేకమైన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాటిలో ముఖ్యమైనవి. దీపావళి రోజున లక్ష్మీదేవి, వినాయకుడికి ప్రత్యేక పూజలు చేస్తారు. కాబట్టి, కొత్త లక్ష్మీ గణేశ విగ్రహాలు లేదా పటాలను ఇంటికి తీసుకురావడం అత్యంత శుభప్రదంగా భావిస్తారు. లక్ష్మీదేవి పద్మంలో కూర్చుని ఉన్న విగ్రహం లేదా నాణెం కొనడం మంచిది.

ధనత్రయోదశి రోజున, దీపావళి రోజున బంగారం, వెండి వస్తువులు లేదా నాణేలు కొనడం ద్వారా లక్ష్మీదేవి, కుబేరుల ఆశీస్సులు లభిస్తాయని, ఇంట్లో సంపద పెరుగుతుందని నమ్ముతారు. వెలుగుల పండుగ కాబట్టి, దీపాలు తప్పనిసరి. కొత్త మట్టి ప్రమిదలు, వివిధ రకాల అలంకరణ దీపాలు.

భీమసేని కర్పూరం  ఇది సాధారణ కర్పూరం కన్నా ఎక్కువ సువాసన కలిగి ఉంటుంది. దీనిని వెలిగించడం ద్వారా ఇంట్లోని ప్రతికూల శక్తి తొలగిపోయి, సానుకూల శక్తి పెరుగుతుందని నమ్ముతారు. చీపురును లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తారు. దీపావళి రోజున కొత్త చీపురు కొనడం శుభప్రదం. లక్ష్మీ పూజలో శ్రీ యంత్రం, గోమతి చక్రాలు, పసుపు కొమ్ముఉంచి పూజించడం ద్వారా సిరిసంపదలు కలుగుతాయని విశ్వాసం.

దక్షిణావర్తి శంఖం లక్ష్మీదేవికి ప్రీతిపాత్రమైనది. పూజ గదిలో ఉంచుకుంటారు. కుటుంబ సభ్యులందరూ కొత్త దుస్తులు ధరించి పండుగను జరుపుకుంటారు. దీపావళికి వివిధ రకాల పిండివంటలు, మిఠాయిలు తయారుచేయడం లేదా కొనుగోలు చేయడం ఆచారం. పండుగ సాయంత్రం టపాసులు కాల్చడం సంతోషానికి గుర్తు.

ఈ విధంగా దీపావళి సందర్భంగా కొత్త వస్తువులు కొని, ఇంటిని అలంకరించి, లక్ష్మీదేవిని పూజించడం ద్వారా ఆనందం, శ్రేయస్సు కలుగుతాయని హిందువులు నమ్ముతారు. దీపావళి పండుగ సమయంలో బంగారం, వెండి కొనుగోలు చేయడం ద్వారా శుభ ఫలితాలు కలుగుతాయి. వీటిని కొనుగోలు చేస్తే ఎన్నో బెనిఫిట్స్ చేకూరుతాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: