ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ ప్రపంచంలోనే అతిపెద్ద అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ అన్న సంగతి అందరికీ తెలిసిందే..BCCI ప్రపంచంలోనే అత్యంత ధనిక క్రికెట్ బోర్డు గా కూడా ఎదగడానికి ముఖ్య కారణం ఈ ఐపిఎల్. 2008లో ప్రారంభం అయ్యి ప్రతి ఏడాది కూడా సరికొత్త శిఖరాలను అధిరోహిస్తోంది ఐపీఎల్. కానీ తాజాగా వచ్చిన నివేదికతో ఒక పెద్ద దెబ్బ తగిలినట్లుగా వినిపిస్తోంది. గత ఏడాది కంటే ఐపీఎల్ బ్రాండ్ విలువ చాలా గణనీయంగా తగ్గిపోయినట్లు సమాచారం.



గత సంవత్సరం కంటే ఈసారి 8% వరకు మేర బ్రాండ్ విలువ తగ్గిపోయినట్లు తెలుస్తోంది. గత ఏడాది ఐపీఎల్ బ్రాండ్ విలువ రూ. 82,700 కోట్ల రూపాయలు ఉండగా తాజాగా నివేదిక అందుతున్న సమాచారం ప్రకారం ఈ ఏడాది రూ. 76,100 కోట్లకు పడిపోయినట్లు తెలుస్తోంది. డిడి అండ్ అడ్వైజర్ తెలుపుతున్న ప్రకారం ఐపీఎల్ విలువ తగ్గడం ఇది రెండవ సంవత్సరమని 2023 లో కూడా 92 ,500 కోట్లు ఉండేది కానీ ఇప్పుడు అమాంతం తగ్గిపోయిందని తెలిపారు. ఇలా తగ్గడానికి ముఖ్య కారణాలను ఒక నివేదిక తెలియజేసింది.

2024లో  డిస్నీ స్టార్, వయాకామ్ 18 విలీనం కావడం వల్ల మీడియా హక్కులకు పోటీ తగ్గిపోయిందని దీని ఎఫెక్ట్ ఐపీఎల్ బ్రాడ్ కాస్టింగ్ పైన పడిందట. అలాగే భారత ప్రభుత్వం తీసుకున్న మనీ గేమింగ్ యాప్స్ ల పైన నిషేధం విధించడంతో ఐపీఎల్ కు స్పాన్సర్లుగా ఉన్న ఎన్నో కంపెనీలు ఈ రంగానికి చెందినవే కావడం చేత ఆదాయానికి గండి పడింది. ఈ రెండు కారణాల వల్ల ఐపిఎల్ ఎకోసిస్టమ్ విలువ భారీగా పతనం అయ్యిందని.. 2023లో 92,500 కోట్లు ఉన్న లీగ్ ప్రస్తుతం రూ.76,100 కోట్లకు చేరడంతో ఐపీఎల్ వ్యవస్థకు సుమారుగా రూ.16,400 కోట్ల రూపాయలు నష్టం వచ్చినట్లు నివేదికలు తెలియజేస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: