బండ్ల గణేష్ ఎప్పుడు ఏదో ఒక వివాదం ద్వారా సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటారు. ఈయన తన సోషల్ మీడియా ఖాతాని వేదికగా చేసుకొని చేసే ట్వీట్లు,పోస్టులు నెట్టింట హాట్ టాపిక్ గా నిలుస్తాయి. అయితే తాజాగా బండ్ల గణేష్ తన సోషల్ మీడియా ఖాతాలో ఓ ట్వీట్ పెట్టారు. "అది పీకుతా ఇది పీకుతా అని అనడం కాదు.. ఎందుకంటే మాటలు మన చేతిలో ఉన్నా ఆట ఎవరిది అనేది జనాలే తీర్మానిస్తారు అంటూ సెన్సేషనల్ ట్వీట్ పెట్టారు. అయితే ఈ ట్వీట్ బన్నీ వాసు ని ఉద్దేశించే బండ్ల గణేష్ పెట్టినట్టు పలువురు భావిస్తున్నారు. ఎందుకంటే రీసెంట్ గా లిటిల్ హార్డ్స్ మూవీ సక్సెస్ మీట్ లో బండ్ల గణేష్ మాట్లాడిన తీరుకి బన్నీ వాసు తాజాగా మిత్రమండలి ప్రమోషన్స్ లో భాగంగా బండ్ల గణేష్ మాటలకి మేము కూడా షాక్ అయ్యాం. ఆయన వల్ల టీం మొత్తం ఇబ్బంది పడింది. ఆయన అలా మాట్లాడి ఉండకూడదు అంటూ మాట్లాడారు. 

అయితే దీనికి కౌంటర్ గా బండ్ల గణేష్ తన సోషల్ మీడియాలో ఆ ట్వీట్ పెట్టినట్టు అర్థమవుతుంది.అయితే బండ్ల గణేష్ ఈ ట్వీట్ ఏ ఉద్దేశంతో పెట్టారంటే రీసెంట్గా మిత్రమండలి మూవీ ప్రమోషన్స్ లో నిర్మాత బన్నీ వాసు మా సినిమా విడుదల కాకముందే నెగటివ్ చేస్తున్నారు.చాలామంది ట్రైలర్ చూసి ట్రోల్స్ చేస్తున్నారు.కానీ సినిమా చూశాక బాగా లేకపోతే అప్పుడు ట్రోల్స్ చేయండి.ఎవరు ఎన్ని చేసినా నన్ను ఏమి పీకలేరు. నా వెంట్రుక కూడా పీకలేరు. కొంతమంది నా సినిమా గురించి నెగిటివ్ చేయమని డబ్బులు ఇచ్చి ఇలా ట్రోల్స్ చేయిస్తున్నారు..

అంటూ పెద్ద పెద్ద డైలాగులు కొట్టారు.కానీ తీరా మిత్రమండలి సినిమా విడుదలయ్యాక దాని రిజల్ట్ ఎలా ఉందో చెప్పనక్కర్లేదు. ఈ సినిమా ఈరోజు విడుదలై నెగిటివ్ టాక్ తెచ్చుకుంది.కామెడీ,బిజిఎం, కథ ఏవి బాలేవని సినిమా చూసిన జనాలు రివ్యూ ఇస్తున్నారు.అలా సినిమా విడుదలకు ముందే ఎన్నో పెద్ద పెద్ద డైలాగులు కొట్టిన బన్నీ వాసుకి కౌంటర్గా బండ్ల గణేష్ ఈ విధంగా ట్వీట్ పెట్టినట్టు తెలుస్తోంది. అలా మనం ఎన్ని మాటలు చెప్పినా రిజల్ట్ అనేది జనాల చేతుల్లోనే ఉంటుంది అని పరోక్షంగా కౌంటర్ ఇచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: