ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఏదైనా మ్యాటర్ ఇట్టే ట్రెండింగ్ లోకి వచ్చేస్తుంది. అది జనాలకి అవసరమైన విషయమైనా..జనాలకి అవసరం లేని విషయం అయినా.  సరిగ్గా స్టార్‌లతో సంబంధం కలిగిన వార్తలే ఎక్కువగా ట్రెండ్ అవుతుంటాయి. నేటి సమాజానికి  సినీ ఇండస్ట్రీలో ఈ తరహా ట్రెండ్స్ చాలా సాధారణమైపోయాయి. అలాంటి పరిణామంలో, సీనియర్ నటుడు నరేష్ పేరు ఇటీవల మళ్ళీ వైరల్ అవుతుంది. గతంలో  ఆయన చేసిన పనులు మళ్లీ గుర్తు చేసుకుంటూ ట్రోల్ చేస్తున్నారు జనాలు.  గతంలో నరేష్ పేరు ఇండస్ట్రీలో బాగా వినిపించింది. మంచి నటుడిగా పేరొందిన వ్యక్తి అని అనుకునేవారు.  ఒకప్పుడు ఆయన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు, తరువాత కొన్ని ఇతర వ్యక్తిగత సంబంధాల విషయాలల్లో ట్రోలింగ్ కి గురైయ్యారు. అదే పవిత్రలోకేష్‌తో ఉన్న బంధం—సోషల్ మీడియాలో రకరకాల చర్చలకు కారణమయ్యాయి. అయితే, ఆ చర్చలు పెద్ద ప్రభావాన్ని చూపలేదు, ప్రేక్షకులు ప్రధానంగా ఆయన నటనను మాత్రమే గుర్తు చేసుకున్నారు.

ఇప్పుడు నరేష్ తాజాగా స్టేజీపై చేసిన పనులు కారణంగా సోషల్ మీడియాలో అతని పేరు వైరల్ అవుతుంది. ఈ మధ్యకాలంలో ఒక ఫ్రీ రిలీజ్ ఈవెంట్ సందర్భంగా ఆయన స్టేజీపై రచ్చ రచ్చ చేశారు. అదేవిధంగా, ఆయన ఇద్దరు  యువ హీరోయిన్లతో కలిసి డ్యాన్స్ చేశారు.  ఇది సోషల్ మీడియాలో ప్రత్యేకంగా వైరల్ అయ్యింది. ఈ డ్యాన్స్‌లో ఆయన చేసిన స్టెప్పులు, ఎక్స్ ప్రేషన్స్..నాటీగా  నటించడం ప్రేక్షకులను ఆశ్చర్యంలో ముంచెత్తింది. కిరణ్ అబ్బవరం తాజాగా అంటించిన సినిమా "కె ర్యాంప్". ఈ సినిమా రేపు గ్రాండ్ గా ధియేటర్స్ లో రిలీజ్ కాబోతుంది.

ప్రమోషన్స్ లో భాగంగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ నిన్న ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా  ఈవెంట్‌లో  నరేష్ కూడా పాల్గొని, స్టేజీపై సందడి చేసారు. బ్లాక్ షర్ట్ లో చాలా హ్యాండ్ సమ్ గా కనిపించడానికి ట్రై చేశాడు. ముఖ్యంగా, కామ్నా జఠ్మలని మరియు విమల రామన్‌తో కలిసి డ్యాన్స్ చేసిన విధానం హైలెట్ గా మారింది. ఈ వీడియో  సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. జనాలు ఈ వీడియోపై భిన్న విభిన్నంగా స్పందిస్తున్నారు. కొందరు“ఇద్దరూ హీరోయిన్స్‌తో ఇంత సన్నిహితంగా వ్యవహరిస్తున్నారు” అని పేర్కొంటున్నారు, మరికొందరు “నరేష్ ఇప్పటికీ నాటీ గానే ఉన్నారు.. చిలిపిగా ఆకర్షిస్తున్నాడు” అని కామెంట్లు చేస్తున్నారు. ఆయన వయసు వచ్చినప్పటికీ, స్టేజ్‌పై ఉత్సాహంగా, ఆత్మవిశ్వాసంతో ప్రదర్శించిన డ్యాన్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంది.మొత్తం మీద, ఈ వీడియో, ఈవెంట్, మరియు నరేష్ ప్రదర్శన సోషల్ మీడియాలో తీవ్రంగా చర్చనీయాంశంగా మారింది. నరేష్ తన వ్యక్తిగత శైలిని, వినోదాన్ని, మరియు ప్రస్తుత సందర్భాన్ని మిక్స్ చేసి, సోషల్ మీడియాలో మరల అందరి దృష్టిని ఆకర్షించాడు. కొందరైతే మస్త్ ఎంజాయ్ చేస్తున్నాడు అంటూ ఘాటుగా స్పందిస్తున్నారు..!!
 

మరింత సమాచారం తెలుసుకోండి: