
నరేష్ మాట్లాడుతూ –“ప్రిన్స్ మహేశ్ బాబు, అల్లు అర్జున్, నాని తర్వాత ఇండస్ట్రీలో ఆ స్థాయికి చేరుకునే సామర్థ్యం ఉన్న హీరో కిరణ్ అబ్బవరం మాత్రమే. అతను నిజాయితీగా పని చేస్తున్నాడు, మంచి కంటెంట్ ఉన్న సినిమాలను ఎంచుకుంటున్నాడు. భవిష్యత్తులో ఈ ఇండస్ట్రీలో అతని పేరు బంగారంలా మెరవబోతుంది,” అని చెప్పుకొచ్చారు. ఆ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అభిమానులు కూడా నరేష్ మాటలకు పూర్తి సమ్మతి వ్యక్తం చేస్తూ,“నిజమే... మహేశ్ బాబు, బన్నీ, నాని లాగే కిరణ్ కూడా తన సొంత టాలెంట్‌తో ముందుకు వెళ్తున్నాడు. ఎలాంటి ఫిల్టర్ లేకుండా ఇంటర్వ్యూలలో మాట్లాడే సింపుల్ వ్యక్తిత్వం, తన కృషి, తన నిజాయితీ ఆయనను టాప్ స్టార్‌గా నిలబెడతాయి,”
అని సోషల్ మీడియాలో కిరణ్ అబ్బవరం అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు.
ఇప్పుడు అందరి దృష్టి “కె ర్యాంప్” సినిమాపైనే ఉంది. ఈ సినిమా ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎలా ఉంటాయి, ప్రేక్షకులు ఎంతగా ఆదరిస్తారన్నది చూడాలి. కానీ ఇప్పటికే ఉన్న అంచనాలను బట్టి, కిరణ్ అబ్బవరం తన కెరీర్‌లో మరో సూపర్ హిట్‌ను అందుకోవడం ఖాయమనే భావన అభిమానుల్లో నెలకొంది. ఇలా చూస్తుంటే... బన్నీ, మహేశ్, నాని తర్వాత ఇండస్ట్రీలో ఆ దమ్మున్న మగాడు – నిజంగా కిరణ్ అబ్బవరంనే అని చెప్పుకోవచ్చు. తన కష్టంతో, కంటెంట్‌కి ప్రాధాన్యత ఇచ్చే దృక్పథంతో, అతను టాలీవుడ్‌కి కొత్త బలం ఇస్తున్నాడు.