
ఈ సారి దీపావళి కానుకగా ఏకంగా నాలుగు సినిమాలు థియేటర్లలోకి వచ్చాయి. ముందుగా వచ్చిన మిత్రమండలి సినిమాకు బ్యాడ్ రిపోర్టులే ఎక్కువుగా వచ్చాయి. ఇక నిన్న సిద్ధు జొన్నలగడ్డ తెలుసుకదా, ప్రదీప్ రంగనాథ్ డ్యూడ్ సినిమాలు ఒకే రోజు వచ్చాయి. ఈ రోజు కిరణ్ అబ్బవరం కే ర్యాంప్ సినిమాలు వచ్చాయి. ఇక నిన్న రిలీజ్ అయిన రెండు సినిమాలు మంచి అంచనాలతోనే వచ్చాయి. రెండు సినిమాలలే ఏ సినిమా పై చేయి సాధిస్తుందన్న అంచనా, ఉత్కంఠ అందరిలోనూ ఉంది. అయితే ఫైనల్‌గా తెలుసు కదా సినిమాపై డ్యూడ్ పై చేయి సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెపుతున్నాయి. డ్యూడ్ ఫ్యామిలీ అండ్ ఎమోషనల్ కామెడీ ఎంటర్ టైనర్ గా తెరకెక్కింది. డ్యూడ్ సినిమాలో మెయిన్ థీమ్, కామెడీ సన్నివేశాలు అండ్ ఎమోషనల్ సీన్స్ బాగున్నాయి. ప్రదీప్ రంగనాథన్, మమితా బైజుల నటన కూడా చాలా బాగుంది. ఐతే, కొన్ని రెగ్యులర్ సీన్స్ వంటి అంశాలు సినిమాకి మైనస్ అయ్యాయి. ఓవరాల్ గా ఈ సినిమా యూత్ ఫుల్ కామెడీ అండ్ ఎమోషనల్ ఎలిమెంట్స్ తో ఆకట్టుకుంది.
తెలుసుకదా సినిమా విషయానికి వస్తే... సిద్ధు జొన్నలగడ్డ మెచ్యూర్డ్ పాత్ర చేశాడు. కానీ ఆ మెచ్యూరిటీని ప్రదర్శించే క్రమంలో తడబాటు ఉందంటున్నారు. ఇక ఇద్దరు హీరోయిన్లలో లైఫ్ లో చిల్ అవ్వాలనుకునే కేర్ ఫ్రీ గర్ల్ గా శ్రీనిధి శెట్టి బాగానే చేసింది. రాశీ ఖన్నా పాత్ర హుందాగానే సాగినా సెకండ్ హాఫ్‌లో ట్విస్ట్‌లతో పాటు టర్న్‌ను సరిగా ఎక్స్‌ప్రెస్ చేయలేదంటున్నారు. సినిమా అంతా మూడు పాత్రల చుట్టూనే తిరుగుతూ ఉండడం కాస్త బోర్ అంటున్నారు. ఫస్టాఫ్ బాగున్నా.. సెకండాఫ్‌లో సిద్ధు నిజ స్వరూపం తర్వాత సినిమా స్పీడ్ తగ్గిపోయిందంటున్నారు. ఈ కథ అందరికి ఎంత వరకు కనెక్ట్ అవుతుందన్న సందేహాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. పండగ నేపథ్యంలో ఫ్యామిలీ ఆడియెన్స్‌కు నచ్చితే తెలుసుకదా కూడా బాక్సాఫీస్ దగ్గర గట్టెక్కే ఛాన్సులు ఉన్నాయి.
తెలుసుకదా సినిమాలో ఓ సాధారణమైన కథను తన స్క్రీన్ ప్లేతో కొత్తగా చూపించడానికి నీరజ కోన ప్రయత్నం చేసింది. కానీ అది కన్ ఫ్యూజన్ కు గురిచేసింది. కథకు తగ్గట్టుగా నిర్మాతలు బాగానే ఖర్చు పెట్టారు. 'తెలుసు కదా' అని హీరో ఎంత చెప్పినా... ఏదో తెలియని భావనే ఆడియెన్ కు కలుగుతుంది.