
తాజాగా రేణు దేశాయ్ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ పలు ఆసక్తికరమైన విషయాలను తెలియజేసింది. భవిష్యత్తులో తన సన్యాసిగా మారే అవకాశాలు కూడా ఎక్కువగా ఉన్నాయంటూ తెలిపింది. రేణు దేశాయ్ మాట్లాడుతూ .. టైగర్ నాగేశ్వరరావు సినిమా తర్వాత తన మీద చాలా విమర్శలు వచ్చాయని, మళ్లీ సినిమాలలోకి రీఎంట్రీ ఇచ్చింది ఎలాంటి పాత్రలోనైనా చేస్తుందా అని తనని చాలామంది విమర్శించారని తెలిపింది. అందుకే ఇప్పటివరకు మరొక సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇవ్వలేదని తెలిపింది.
అంతేకాకుండా తనకు నటన అంటే చాలా ఇష్టం, కానీ అదే నా లక్ష్యం కాదు, నేను డబ్బుకు ప్రాధాన్యత ఇచ్చే మనిషిని కానే కాదు. ఇప్పటికీ నాకు మంచి పాత్రలు చాలానే వస్తున్నాయి త్వరలోనే అత్త పాత్రలో కనిపిస్తానని ఆ సినిమా షూటింగ్ కూడా త్వరలోనే ప్రారంభం కాబోతోందని తెలిపింది. అంతేకాకుండా తనకు ఆధ్యాత్మిక మార్గం అంటే చాలా ఇష్టమని భవిష్యత్తులో తాను సన్యాసం తీసుకునే అవకాశం కూడా ఎక్కువగా ఉందంటూ తెలిపింది రేణు దేశాయ్. ప్రస్తుతం రేణు దేశాయ్ చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అయితే ఈ విషయం పైన అభిమానులు భిన్నాభిప్రాయాలను తెలియజేస్తున్నారు.