ఈ ప్రజాస్వామ్యంలో  మనల్ని పాలించే ప్రతి నాయకుడు తప్పనిసరిగా ప్రజల ఓట్ల ద్వారానే గెలుస్తారు. ముఖ్యంగా ఒక నియోజకవర్గాన్ని పాలించే ఎమ్మెల్యే గెలవాలి అంటే తప్పకుండా ఏదో ఒక పార్టీ లేదంటే ఇండిపెండెంట్ గా పోటీ చేయాలి. ఇందులో ప్రజలు ఎవరికీ ఎక్కువగా ఓట్లు వేస్తే వారు గెలుపొందుతారు.. అయితే ఈ విషయం అందరికీ తెలుసు. కానీ ఈ మధ్యకాలంలో ఒక పార్టీలో గెలిచినటువంటి నాయకుడు ప్రజలను మోసం చేసి మరో పార్టీలో చేరుతున్నాడు. అలా చాలామంది ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. అయితే ఈ తంతు బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పటి నుంచి మొదలైంది. బీఆర్ఎస్ అధికారంలో ఉన్న  10 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ఇతర పార్టీల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అందరిని బీఆర్ఎస్ తన గుప్పిట్లో పెట్టుకుని పార్టీలో జాయిన్ చేసుకుంది. మూడవసారి బీఆర్ఎస్ ఓడిపోయి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చింది. 

ఆనాడు కేసీఆర్ ఏ విధంగా చేశారో ఇప్పుడు కాంగ్రెస్ కూడా ఆ విధంగానే చేసే ప్రయత్నం చేస్తోంది. బీఆర్ఎస్ లో ఉండేటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు  కాంగ్రెస్ పార్టీలో చేరారని ఒక వివాదం బయటకు వచ్చింది. ఇందులో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్.. అయితే ఈయన కాంగ్రెస్ పార్టీలో చేరారని ఆయనపై వేటు వేయాలని కేటీఆర్ డిమాండ్ చేస్తూ వస్తున్నారు. కానీ దానం నాగేందర్ మాత్రం నేను ఏ పార్టీలో చేరలేదని నియోజక వర్గ అభివృద్ధి కోసం ముఖ్యమంత్రిని కలవడానికి వెళ్తే వారు కండువాలు వేశారని ఇన్నాళ్లు చెప్పుకుంటూ వచ్చారు. అయితే తాజాగా జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ సందర్భంగా దానం నాగేందర్ అసలు రూపం బయటకు వచ్చింది.

కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపైనర్ల లిస్టులో దానం నాగేందర్ పేరు కాంగ్రెస్ అధిష్టానం  బయట పెట్టింది. దీంతో ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరారని అందరికీ బట్టబయలు అయిపోయింది.. అయితే దీనిపై తాజాగా కేటీఆర్ కూడా స్పందించారు. ఆయన కాంగ్రెస్ లో చేరి చేరలేదని బుకాయించడం దారుణమని ప్రజలను మోసం చేయడమే అవుతుందని తెలియజేశారు. ఇలాంటి మోసపూరిత వ్యక్తిపై తప్పకుండా కోర్టు వేటు వేయాలని కేటీఆర్ బలంగా చెబుతూ వస్తున్నారు. అయితే నిజానికి ఆయనపై వేటుపడినా కానీ మళ్ళీ దానం నాగేందర్ ను కాంగ్రెస్ నుంచి బరిలో దించి గెలిపించాలని ప్రయత్నం చేస్తోంది. ఏది ఏమైనప్పటికీ దానం మాత్రం కాంగ్రెస్ పార్టీలో చేరాడు అనేది అందరికీ క్లారిటీ వచ్చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: