తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తరచూ ఏదో ఒక వివాదం జరుగుతూనే ఉంది. అయితే ఈ వివాదం అనేది  ఏదో కార్యకర్తలు, ఇతర నాయకుల మధ్య జరగలేదు.. చివరికి ఎమ్మెల్యేల మధ్య కూడా జరగలేదు.. పోయి పోయి మంత్రుల మధ్యే వివాదం ఏర్పడింది. చివరికి మంత్రులు ఒకరిపై ఒకరు అధిష్టానానికి కంప్లైంట్ చేసుకునే పరిస్థితికి చేరుకున్నారు. అంతేకాదు ఇలా మంత్రులకు మంత్రులే  ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడంతో ప్రజల్లో చులకన అయిపోయారు..ఇంతకీ ఏం జరిగింది అనే వివరాలు చూద్దాం.. కాంగ్రెస్ ఎన్నో హామీలతో అధికారంలోకి వచ్చింది. ఇప్పటికే అందులో చాలా హామీలను నెరవేరుస్తూ దూసుకుపోతోంది. ముఖ్యంగా ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు, సబ్సిడీ గ్యాస్, రైతు రుణమాఫీ, నిరుద్యోగులకు ఉద్యోగాలు, కొత్త రేషన్ కార్డులు ఇలా అనేక పథకాలు అందిస్తున్నారు. ఇదిలా నడుస్తున్న సమయంలో బీసీ లకు 42% రిజర్వేషన్ కి సంబంధించి పెద్ద ఇష్యూ రాష్ట్రంలో నడుస్తోంది. 

అయితే ఈ ఇష్యూ గాలికి వదిలేసి తాజాగా కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మధ్య వివాదం చెలరేగింది. అది మరువక ముందే కొండా సురేఖ ఓఎస్డి గన్ పట్టుకొని బెదిరించాడని దీనికి సంబంధించి వేం నరేందర్ రెడ్డి కూడా వారితో ఉన్నాడనే వార్తలు వినిపించాయి. ఇదే సమయంలో కొండా సురేఖ కూతురు మీడియా ముందుకు వచ్చి రెడ్డీల రాజ్యం నడుస్తోంది అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విమర్శించింది. చివరికి ఈ వ్యవహారం చిలికి చిలికి కాంగ్రెస్ అధిష్టానానికి చేరింది. వాళ్లు ఎలాంటి ఆదేశాలు ఇచ్చారనేది తెలియదు కానీ తాజాగా ఈ వివాదాలన్నింటికి తెరపడ్డట్టు తెలుస్తోంది. ఎందుకంటే కొండా సురేఖ ఫ్యామిలీని రేవంత్ రెడ్డి పిలిపించుకొని దీపావళి వేడుకలు జరుపుకున్నారు.

అంతేకాదు కొండా మురళి అయితే రేవంత్ రెడ్డిపై ప్రశంసల జల్లు కురిపించారు. రేవంత్ రెడ్డి చాలా మంచి వ్యక్తి ఆయన నాకు ఎమ్మెల్సీ పదవి కూడా ఇస్తానని చెప్పారు అని చెప్పారు అంటూ మాట్లాడారు.ఈ విధంగా కొండా సురేఖ వివాదాలు పెడుతుంటే, కూతురు బయటకు వచ్చి విమర్శలు చేస్తుంటే,  భర్త పొగుడుతూ వస్తున్నాడు. ఈ విధంగా మూడు మాటలు కొండా ఫ్యామిలీ నుంచే బయటకు వచ్చాయి. దీన్ని బట్టి చూస్తే మాత్రం రేవంత్ రెడ్డి కొండా సురేఖను క్షమించి వదిలేసినట్టు తెలుస్తోంది. కట్ చేస్తే కాంగ్రెస్ పార్టీలో నాయకులు ఇలాగే ఉంటారు. ఒకరిపై ఒకరు  విపరీతమైన విమర్శలు చేసుకొని మళ్లీ కలిసిపోయి పండగలు చేసుకుంటారు. ఇదే వారి స్పెషాలిటీ అంటూ కామెంట్లు పెడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: