
నూనె లేదా గ్రీజు మరకలు పడినప్పుడు అరబకెట్ నీటిలో ఒక టేబుల్ స్పూన్ ఉప్పు, రెండు టేబుల్ స్పూన్ల నిమ్మరసం వేసి బట్టలను కొంత సమయం నానబెట్టాలి. తర్వాత డిటర్జెంట్‌తో ఉతికితే మరకలు తగ్గుముఖం పడతాయి. బేకింగ్ సోడాను నీటితో కలిపి పేస్ట్‌లా చేసి మరక ఉన్న చోట రాయాలి. అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో ఉతికితే మొండి మరకలు కూడా వదిలిపోతాయి. తెల్లటి బట్టలపై మరకలు తొలగించడానికి ఇది బాగా పనిచేస్తుంది.
గోరువెచ్చటి నీటిలో కొద్దిగా వెనిగర్ కలిపి మరక ఉన్న బట్టలను నానబెట్టి, ఆ తర్వాత ఉతికితే కూడా మరకలు పోతాయి. రక్తం మరక వంటి వాటిపై హైడ్రోజన్ పెరాక్సైడ్ వేసి నానబెట్టిన తర్వాత డిటర్జెంట్‌తో ఉతికితే మరకలు పోతాయని నిపుణులు చెబుతున్నారు. లిప్‌స్టిక్ వంటి మరక పడితే దానిపై కాస్త గ్లిజరిన్ రాసి అరగంట తర్వాత ఉతకడం వల్ల మరక తొలగుతుంది.
ఇంక్ మరకలు పడిన చోట పేపర్ టవల్‌తో అద్ది, ఆ తర్వాత హెయిర్ స్ప్రే చల్లి కొంతసేపటి తర్వాత ఉతికితే మరక తొలగుతుంది. లేదా నిమ్మకాయ ముక్కతో రుద్దినా ఫలితం ఉంటుంది. కెచప్ మరక పడితే వెంటనే దాన్ని డిటర్జెంట్‌తో నీటిలో ముంచి సబ్బుతో కడగాలి. అలాగే, సున్నితమైన బట్టల విషయంలో జాగ్రత్త వహించాలి. ఈ చిట్కాలు మొండి మరకలను తొలగించడంలో మీకు ఎంతగానో సహాయపడతాయి. అయితే కొన్ని మరకలు మాత్రం ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా వదలకుండా ఇబ్బంది పెడతాయనే సంగతి తెలిసిందే.