కిరణ్ అబ్బవరం తాజాగా కే ర్యాంప్ అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా ఇప్పటివరకు నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ ను ప్రపంచ వ్యాప్తంగా కంప్లీట్ చేసుకుంది. ఈ నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్స్ వచ్చాయి. ఈ సినిమాకు ఎన్ని కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ ఇంకా ఎన్ని కోట్ల కలెక్షన్లను సాధిస్తే బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుంటుంది అనే వివరాలను క్లియర్ గా తెలుసుకుందాం.

నాలుగు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ సినిమాకు నైజాం ఏరియాలో 2.25 కోట్ల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ ఏరియాలో 88 లక్షలు , ఆంధ్ర ఏరియాలో 2.59 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా నాలుగు రోజుల్లో ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 5.72 కోట్ల షేర్ ... 9.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక నాలుగు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలుపుకుని 76 లక్షల కలెక్షన్లు దక్కగా , ఓవర్సీస్ లో 85 లక్షల కలెక్షన్లు దక్కాయి. నాలుగు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 7.33 కోట్ల షేర్ ... 13.50 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా 8.15 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా మరో 1.67 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసినట్లయితే ఈ సినిమా ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ ను అందుకుంటుంది. ప్రస్తుత పరిస్థితులను బట్టి చూస్తే ఈ సినిమా మరికొన్ని రోజుల్లో హిట్ స్టేటస్లు అందుకునే అవకాశాలు కనబడుతున్నాయి అని చాలా మంది అంచనా వేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: