పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు మారుతి కాంబోలో తెరకెక్కిన తాజా చిత్రం ది రాజాసాబ్. ఈ సినిమాపై అభిమానుల్లో, ఇండస్ట్రీ వర్గాల్లో అంచనాలు భారీగా ఉన్నాయి. హారర్ కామెడీ జానర్‌లో రూపొందుతున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026 జనవరి 9న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

ప్రభాస్ వంటి స్టార్ హీరోతో సినిమా చేయడం దర్శకుడు మారుతి కెరీర్‌కు కీలకం కానుంది. చిన్న, మధ్య తరహా చిత్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న మారుతికి, ది రాజాసాబ్ గనుక భారీ విజయాన్ని సాధిస్తే, స్టార్ డైరెక్టర్ల జాబితాలో ఆయన పేరు కూడా చేరే అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. ఈ సినిమా విజయం మారుతికి తిరుగులేని స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టడం ఖాయమని ట్రేడ్ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

ది రాజాసాబ్ చిత్రీకరణ జరుగుతున్న తీరు, మారుతి వర్కింగ్ స్టైల్ ప్రభాస్‌కి ఎంతగానో నచ్చినట్లు తెలుస్తోంది. అందుకే, ఈ సినిమా విడుదల కాకముందే, మారుతితో మరో సినిమా చేయడానికి ప్రభాస్ ఆసక్తి చూపుతున్నారనే వార్తలు సినీ వర్గాల్లో చక్కర్లు కొడుతున్నాయి. ప్రభాస్ వంటి పాన్ ఇండియా స్టార్ నుంచి వరుసగా రెండు అవకాశాలు దక్కించుకోవడం అనేది మారుతి అదృష్టంగా నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో పలు భారీ ప్రాజెక్టులు ఉన్నప్పటికీ, మారుతికి మరో అవకాశం ఇవ్వడానికి సుముఖత చూపడం అనేది, దర్శకుడి పనితీరుపై ప్రభాస్‌కి ఉన్న నమ్మకాన్ని తెలియజేస్తుంది.

ది రాజాసాబ్ చిత్రంతో ప్రభాస్ తొలిసారి హారర్ కామెడీని ప్రయత్నిస్తుండటం అభిమానులను మరింత ఉత్సాహపరుస్తోంది. ప్రభాస్ నుంచి రాబోయే ఈ విభిన్నమైన చిత్రం విజయం సాధిస్తే, దర్శకుడు మారుతికి సినిమా కెరీర్‌లో గొప్ప మలుపుగా చెప్పవచ్చు. మొత్తం మీద, మారుతికి ప్రభాస్ రూపంలో అద్భుతమైన అదృష్టం తలుపు తట్టిందని చెప్పడంలో సందేహం లేదు. ది  రాజాసాబ్ మూవీపై అంచనాలు  అంతకంతకూ  పెరుగుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: