2021 సంవత్సరంలో విడుదలై సంచలనం సృష్టించిన 'అఖండ' సినిమా ఎంత పెద్ద హిట్టో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగరాసింది. ఈ సినిమాకు సీక్వెల్‌గా 'అఖండ 2' తెరకెక్కుతుండటం, దీనిపై భారీ అంచనాలు నెలకొనడం సహజం. తాజాగా, దీపావళి కానుకగా 'అఖండ 2 తాండవం' సినిమా నుంచి 'బ్లాస్టింగ్ రోర్' పేరుతో విడుదల చేసిన గ్లింప్స్ సినీ అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.

సాధారణంగా బోయపాటి శ్రీను-బాలకృష్ణ కాంబినేషన్ అంటేనే బాలయ్య డ్యూయల్ రోల్ చేయడం అనేది కామన్‌గా జరుగుతుంది. అయితే, 'అఖండ 2' సినిమాలో దీనికి భిన్నంగా ఉంటుందని ఫ్యాన్స్ ఆశించారు. కానీ, విడుదలైన గ్లింప్స్‌ను బట్టి చూస్తే బోయపాటి శ్రీను మళ్లీ అదే ఫార్ములాను ఫాలో అయ్యారా? అనే సందేహాలకు అవుననే సమాధానమే వినిపిస్తోంది. గ్లింప్స్‌లో బాలయ్య పవర్ ఫుల్ డైలాగ్‌తో అభిమానులను అలరించారు.

''సౌండ్ కంట్రోల్ లో పెట్టుకో.. ఏ సౌండ్ కి నవ్వుతానో, ఏ సౌండ్ కి నరుకుతానో నాకే తెలియదు కొడకా.. ఊహకి కూడా అందదు'' అంటూ బాలకృష్ణ చెప్పిన ఈ డైలాగ్ సినిమా రేంజ్ ఏ స్థాయిలో ఉండబోతుందో పట్టి చూపుతోంది. ఈ డైలాగ్‌కు థియేటర్లు దద్దరిల్లడం ఖాయమని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు.

'అఖండ 2' ఎప్పుడు విడుదలైనా బాక్సాఫీస్ వద్ద ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలుస్తుందని సినీ వర్గాల నుంచి, ప్రేక్షకుల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కెరీర్‌కు సైతం మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ అవసరం ఉంది. 'అఖండ 2' సినిమాతో ఆ లోటు తీరుతుందేమో వేచి చూడాలి. నందమూరి అభిమానులకు ఈ చిత్రం మరో పండగలాంటి అనుభూతిని ఇవ్వడం పక్కా అని చెప్పవచ్చు. అఖండ2 మూవీ డిసెంబర్ నెల 5వ తేదీన థియేటర్లలో విడుదల కానుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: