ప్రముఖ  హీరోయిన్ మమితా బైజు పేరు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా మారుమ్రోగుతోంది. మలయాళంలో ఆమె నటించిన 'ప్రేమలు' అనే సినిమా తెలుగులో కూడా డబ్ అయి సంచలన విజయం సాధించడంతో మమితా బైజుకు మంచి గుర్తింపు లభించింది. ఇటీవల వచ్చిన 'డ్యూడ్' సినిమా సక్సెస్ లో కూడా మమితా బైజు కీలక పాత్ర పోషించారు. ఈ విజయాల వల్ల మమితా బైజుకు ఎక్కువ సంఖ్యలో ఆఫర్లు వస్తున్నాయని సమాచారం అందుతోంది.

విజయ్ హీరోగా తెరకెక్కుతున్న 'జననాయకన్' సినిమాలో సైతం మమితా బైజు కీలక పాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీకి కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ సినిమాలో ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ధనుష్ 54వ సినిమాలో ఈ బ్యూటీ కథానాయికగా నటించనున్నారని సమాచారం. ఈ సినిమాకు 'పోర్ తొళిల్‌' వంటి సూపర్ హిట్ థ్రిల్లర్‌తో దర్శకుడిగా పరిచయమైన విఘ్నేష్ రాజా దర్శకత్వం వహించనున్నారు.

సినిమా 'D54' అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందుతోంది. ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే మొదలైంది.  వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాలో జయరామ్, కె.ఎస్. రవికుమార్ వంటి ప్రముఖ నటులు కూడా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. మమితా బైజు కెరీర్‌లో ఈ రెండు పెద్ద ప్రాజెక్టులు ఆమె స్టార్‌డమ్‌ను పెంచే అవకాశం ఉంది.

ఈ చిత్రంలో మమితా బైజు ట్రెడిషనల్ విలేజ్ గర్ల్ పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. ఈ పాత్ర కోసం ముందుగా పూజా హెగ్డేను సంప్రదించినా, చివరకు మమితా వైపు మేకర్స్ మొగ్గు చూపారని టాక్. వేల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్ బ్యానర్‌పై డా. ఇషారి కె. గణేష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో నటుడు, దర్శకుడు కె.ఎస్. రవికుమార్ సైతం ఒక సీరియస్ రోల్‌లో నటిస్తుండటం ఆసక్తిని పెంచుతోంది. జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. మమితా బైజు చేతిలో విజయ్, ధనుష్ వంటి స్టార్ హీరోల ప్రాజెక్టులతో పాటు, సూర్య నటిస్తున్న 'సూర్య 46' వంటి మరో పెద్ద సినిమా కూడా ఉండటంతో, రాబోయే రోజుల్లో ఆమె స్టార్ హీరోయిన్‌గా మారడం పక్కా అని చెప్పవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: