టాలీవుడ్ ఇండస్ట్రీలో యువతను ఆకట్టుకుంటున్న స్టార్ హీరోయిన్ శ్రీలీలకు ఊహించని స్థాయిలో క్రేజ్, ఫ్యాన్ ఫాలోయింగ్, పాపులారిటీ ఉన్నాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న ఈ బ్యూటీ పారితోషికం కూడా ఒకింత భారీ స్థాయిలోనే ఉండటం గమనార్హం.
తాజాగా, రవితేజ సరసన నటిస్తున్న 'మాస్ జాతర' సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా శ్రీలీల పలు ఆసక్తికర విషయాలను వెల్లడించారు., రవితేజ నుంచి ఫ్యాన్స్ ఎలాంటి మాస్ అంశాలను కోరుకుంటారో అదే విధంగా ట్రైలర్ ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 'మాస్ జాతర' సినిమాలో మాస్ మహారాజా రవితేజ రైల్వే పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ సినిమా కమర్షియల్ మీటర్‌పై నడిచే యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా బాక్సాఫీస్‌ను ఏ స్థాయిలో షేక్ చేస్తుందో చూడాల్సి ఉంది.
ఈ చిత్రంలో తన పాత్ర గురించి శ్రీలీల వివరిస్తూ... "మాస్ జాతర సినిమాలో నాది మాస్ రోల్. అక్కడక్కడా కామెడీ కూడా చేశాను. ప్రేక్షకులు కచ్చితంగా ఎంజాయ్ చేస్తారు" అని వెల్లడించారు. ఈ సినిమాను భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. కెరీర్ పరంగా బిజీగా ఉన్న శ్రీలీల తన లుక్స్‌పై కూడా దృష్టి సారించారు. ఇటీవల ఆమె లుక్స్‌లో మార్పులు వచ్చి, బరువు తగ్గడం స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం ఆమె మరింత స్లిమ్‌గా ఉన్నారు.
దీని గురించి శ్రీలీల మాట్లాడుతూ ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. "నేను ఫుడ్ మీద కంట్రోల్ పెట్టుకోవాలని నిర్ణయించుకున్నాను. ప్రస్తుతం నేను సరైన ఫుడ్ తినాలని అనుకుంటున్నాను. గతంలో, నాకు చిరుతిళ్లపై చాలా ఇష్టం ఉండేది. అందుకే, అరిసెలు, చేగోడీలు, బజ్జీలు వంటి వాటిని టపాటపా లాగించేసేదానిని" అని నవ్వుతూ చెప్పారు.
"ప్రస్తుతం చిరుతిళ్ళు అన్నీ తగ్గించాను. నా బెస్ట్ లుక్స్ కోసం నేను ట్రై చేస్తున్నాను" అని శ్రీలీల తెలిపారు. ప్రస్తుతం శ్రీలీల తెలుగుతో పాటు బాలీవుడ్ ప్రాజెక్ట్‌లలో సైతం నటిస్తున్న సంగతి తెలిసిందే. శ్రీలీల తీసుకుంటున్న ఈ ఆహార నియంత్రణ, ఫిట్‌నెస్ ప్రయత్నాలు ఆమె సినీ కెరీర్‌కు ఏ మేరకు ప్లస్ అవుతాయో చూడాలి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి