 
                                
                                
                                
                            
                        
                        టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోలకు దక్కిన స్థాయిలో పారితోషికాలు హీరోయిన్లకు దక్కవనే సంగతి తెలిసిందే. కొంతమంది హీరోయిన్లు తమ పారితోషికాల విషయంలో సంతృప్తితో ఉంటే మరి కొందరు హీరోయిన్లు మాత్రం రెమ్యునరేషన్ల గురించి అసంతృప్తిని వ్యక్తం చేస్తూ ఉంటారు. రష్మిక, ప్రియమణి రెమ్యునరేషన్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. దీపికా పదుకొనే పని గంటల గురించి కొన్ని రోజుల క్రితం చేసిన కామెంట్లు ఒకింత సంచలనం అయ్యాయి.
పని గంటల వల్లే ఆమె 2 భారీ ప్రాజెక్ట్స్ నుంచి తప్పుకుంది. రష్మిక పారితోషికం గురించి చెబుతూ ఎవరూ అడిగినంత ఇవ్వరని బడ్జెట్ కష్టంగా ఉందని చెబుతారని అయితే మనం ఎంత అడిగాం ఎంత ఇస్తున్నారనేది ముఖ్యమని ఆమె పేర్కొన్నారు. మనం 100 రూపాయలు అడిగిన సమయంలో వాళ్ళు 20 రూపాయలు మాత్రమే ఇస్తామని చెబితే కష్టం అని ఆమె కామెంట్లు చేశారు. నాకు కూడా ఖర్చులు ఉంటాయని అలాంటి సినిమాలు చేయనని ఆమె తెలిపారు.
నాకు డబ్బు ముఖ్యమే కానీ డబ్బే సర్వస్వము కాదని రష్మిక పేర్కొన్నారు. సినిమాపై ప్రేమ కూడా ముఖ్యమని కొన్నిసార్లు ఆ ప్రేమ వల్ల రెమ్యునరేషన్ తగ్గినా బాధ అనిపించిందని ఆమె చెప్పుకొచ్చారు. హీరోహీరోయిన్ల పారితోషికాల విషయంలో వివక్ష ఉందనే విషయాన్ని మాత్రం తాను అంగీకరిస్తామని రష్మిక తెలిపారు. మరో హీరోయిన్ ప్రియమణి నీకు మార్కెట్ ఉంటే నువ్వు డిమాండ్ చేయాలని తెలిపారు.
మార్కెట్ తక్కువగా ఉంటే మాత్రం పారితోషికం తగ్గించుకోవాలని ఆమె చెప్పుకొచ్చారు. పారితోషికం అనేది మార్కెట్ వాల్యుని బట్టి మాత్రమే ఉంటుందని ఆమె అన్నారు. ఒక సినిమాకు హీరోయిన్ ను చూసి జనం వస్తున్నారంటే ఆ హీరోయిన్ ఎంతైనా డిమాండ్ చేయొచ్చని ప్రియమణి కామెంట్లు చేశారు. ప్రియమణి వెల్లడించిన విషయాలు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతున్నాయి. ప్రియమణి కెరీర్ పరంగా ఆచితూచి అడుగులు వేయాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.
 
             
                             
                                     
                                             క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి