తెలుగు సినీ పరిశ్రమలో తనకంటూ ఒక మంచి గుర్తింపును ఏర్పరచుకున్న యువ నటులలో ప్రియదర్శి ఒకరు. ఈయన పెళ్లి చూపులు అనే సినిమాలో కమీడియన్ గా నటించి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ఈయన కొన్ని సినిమాల్లో కమెడియన్ పాత్రలలో నటించి తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. ఇకపోతే ఈ మధ్య కాలంలో ఈయన సినిమాల్లో ఎక్కువ శాతం హీరో పాత్రలో నటిస్తూ వస్తున్నాడు. గత కొన్ని సంవత్సరాల పాటు ఈయన హీరో గా నటించిన సినిమాలు చాలా వరకు మంచి విజయాలను అందుకున్నాయి.

దానితో ఈయనకు హీరోగా అద్భుతమైన గుర్తింపు ఏర్పడింది. కానీ ఈ మధ్య కాలంలో మాత్రం ప్రియదర్శి కి హీరో పాత్రల ద్వారా విజయాలు దక్కడం లేదు. కొంత కాలం క్రితం ఈయన డార్లింగ్ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ అద్భుతమైన అంచనాల నడుమ విడుదల అయింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను ఏ మాత్రం ఆకట్టుకోలేదు. దానితో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ అయ్యింది. ఇది ఇలా ఉంటే కొంత కాలం క్రితమే ఈ నటుడు మిత్ర మండలి అనే సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. ఈ మూవీ కూడా మంచి అంచనాల నడమ విడుదల అయింది.

కానీ ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫ్లాప్ గా నిలిచింది. ఇలా వరుసగా రెండు భారీ ఫ్లాప్ లను అందుకున్న ఈయన ప్రస్తుతం ప్రేమంటే అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన టీజర్ ను నవంబర్ 2 వ తేదీన విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఇక ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయినట్లయితే ప్రియదర్శి కెరియర్ డేంజర్ లోకి వెళ్లి పోతుంది అని చాలా మంది అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: