సోషల్ మీడియాలో ఈ వేడుకకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు ఇప్పటికే వైరల్ అవుతున్నాయి. ఫోటోల్లో శిరీష్ సంప్రదాయ కుర్తా సెట్‌లో స్టైలిష్‌గా కనిపిస్తే, నయనిక అందమైన రెడ్ కలర్ లెహంగాలో అందరినీ ఆకట్టుకుంది. ఆమె చిరునవ్వు, శిరీష్ చూపుల్లో కనిపించిన ఆనందం ఫ్యాన్స్ గుండెలను తాకాయి.ఇరువురి జంట చేతులు కలిపిన ఆ క్షణం ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ముఖ్యంగా నయనిక ధరించిన నిశ్చితార్థపు ఉంగరంపై అందరి దృష్టి నిలిచింది. ఫ్యూర్ డైమండ్స్‌తో ప్రత్యేకంగా తయారు చేసిన ఈ ఉంగరం ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. దాని ప్రత్యేకత ఏమిటంటే — ఆ ఉంగరంపై “Shirish” మరియు “Nayanika” అనే పేర్ల మొదటి అక్షరాలను కలిపి ప్రత్యేకంగా డిజైన్ చేయించారట. అక్షరాల రూపంలో రూపొందించిన ఆ డైమండ్ రింగ్ ఓ రాయల్ టచ్ ఇస్తోంది.
ఇలాంటి పర్సనలైజ్డ్ డిజైన్లను కొద్ది మంది సెలబ్రిటీలు మాత్రమే ఎంచుకుంటారు. అందుకే ఈ ఉంగరం ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఫ్యాన్స్ కామెంట్స్‌లో “జంట చాలా బాగుంది”, “ఇది డ్రీమ్ కపుల్ లా ఉంది”, “మెగా ఫ్యామిలీకి మరో గ్రాండ్ వేడుక రావడం ఆనందంగా ఉంది” అంటూ ప్రేమతో శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అల్లు కుటుంబం తరఫున కూడా సోషల్ మీడియా ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ, త్వరలో జరగబోయే వివాహ వేడుకకు సంబంధించిన అప్‌డేట్స్ త్వరలో వెల్లడిస్తామని తెలిపారు.ఇక సినీ వర్గాల్లో మాత్రం ఈ నిశ్చితార్థం హాట్ టాపిక్‌గా మారింది. చాలా మంది హీరోలు, దర్శకులు, నిర్మాతలు ఈ జంటకు అభినందనలు తెలియజేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తున్నారు.
అల్లు శిరీష్, ఎప్పుడూ తన సింపుల్ నేచర్, సాఫ్ట్ స్పోకెన్ వ్యక్తిత్వం కోసం పేరొందినవాడు. ఇప్పుడు నయనికతో కలిసి కొత్త జీవితం ప్రారంభించబోతున్నాడు. “ఫ్యామిలీ బ్లెస్సింగ్స్‌తో, ఫ్రెండ్స్ లవ్‌తో ఈ కొత్త ప్రయాణం ప్రారంభమవుతోంది” అని శిరీష్ తన పోస్ట్‌లో పేర్కొన్నాడు.మెగా ఫ్యామిలీ అభిమానులందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో “మెగా వెడ్డింగ్ సీజన్ స్టార్ట్ అయింది” అంటూ హాష్‌ట్యాగ్‌లతో ట్రెండ్ చేస్తున్నారు.అల్లు శిరీష్ – నయనిక జంట ఇప్పుడు టాలీవుడ్‌లోనే కాకుండా దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమై, అందరి ఆశీర్వాదాలను అందుకుంటోంది. వీరి పెళ్లి వేడుక ఎలా జరగబోతోందో అనే ఆసక్తి ఇప్పటికే ఫ్యాన్స్‌లో మొదలైంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి