టాలీవుడ్ ఇండస్ట్రీలో సక్సెస్ రేట్ ఎక్కువగా ఉన్న హీరోలలో రామ్ చరణ్ ఒకరు. రామ్ చరణ్ నటించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్లుగా నిలిచాయి.  అయితే ఆర్ఆర్ఆర్ సినిమాతో బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న రామ్ చరణ్ ఆచార్య,  గేమ్ ఛేంజర్  సినిమాలతో ప్రేక్షకులను నిరాశపరిచారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన గేమ్ ఛేంజర్  అన్ని ఏరియాల్లో ఊహించని స్థాయిలో నష్టాలను మిగిల్చింది.

అయితే గేమ్ ఛేంజర్  సినిమాకు సంబంధించి రామ్ చరణ్ గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే  ఆ సినిమా ప్లాప్ కావడానికి ట్యాగ్ కూడా ఒక కారణమని చాలామంది భావించారు. అయితే పెద్ది సినిమాకు సంబంధించిన పోస్టర్లలో  మాత్రం గ్లోబల్ స్టార్ అనే ట్యాగ్ లేకపోవడం గమనార్హం.  ఈ ట్యాగ్ కు బదులుగా మెగా పవర్ స్టార్ అనే ట్యాగ్ సినిమాలో ఉంది.

అయితే రామ్ చరణ్   గ్లోబల్ స్టార్ ట్యాగ్ వదులుకోవడం గురించి సోషల్ మీడియా వేదికగా పెద్దగా చర్చ జరగడం లేదు. చరణ్ ఈ విధంగా చేసి మంచి పని చేశారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.  రామ్ చరణ్ రెమ్యునరేషన్ సైతం ఒకింత భారీ స్థాయిలో ఉందనే  సంగతి తెలిసిందే.  మరోవైపు ఈ సినిమాలో జాన్వీ కపూర్ అఛ్చాయమ్మ  అనే పాత్రలో కనిపించరు.

రామ్ చరణ్  కెరీర్ పరంగా నెక్స్ట్ లెవెల్ విజయాలను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. రామ్ చరణ్  ఇతర భాషలపై కూడా దృష్టి పెట్టాలని కెరీర్ పరంగా మరిన్ని సంచలనాలను క్రియేట్ చేయాలనీ అభిమానులు ఆశిస్తున్నారు. రామ్ చరణ్ భవిష్యత్తు ప్రణాళికలు  ఏ విధంగా ఉండనున్నాయో  చూడాల్సి ఉంది. రామ్ చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య భారీ స్థాయిలో పెరుగుతోంది.  రామ్ చరణ్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: