సాధారణంగా పాత సినిమాలు రీ-రిలీజ్ అయితే కేవలం అభిమానుల సందడి మాత్రమే కనిపిస్తుంది. కానీ 'బాహుబలి' మాత్రం పదేళ్ల తర్వాత కూడా ఒక కొత్త సినిమా స్థాయిలో కలెక్షన్ల వర్షం కురిపించింది. రీ-రిలీజ్ అయిన చిత్రాల చరిత్రలో ఇంత తక్కువ సమయంలో ఈ స్థాయిలో వసూళ్లు సాధించడం ఇదే తొలిసారి.
రీ-రిలీజ్ చిత్రాలలో ఇంతకుముందు దళపతి విజయ్ నటించిన 'గిల్లి' సినిమా రూ. 33 కోట్ల రికార్డుతో అగ్రస్థానంలో ఉండేది. ఇప్పుడు 'బాహుబలి: ది ఎపిక్' ఆ రికార్డును కేవలం మూడు రోజుల్లోనే అధిగమించి, ఆల్‌టైమ్ నెం.1 స్థానంలో నిలిచింది. ఈ అసాధారణ విజయం హీరో ప్రభాస్ క్రేజ్‌కు, రాజమౌళి విజన్‌కు తిరుగులేని నిదర్శనం. రీ-రిలీజ్‌లోనూ ఈ స్థాయి ప్రభంజనం సృష్టించిన ప్రభాస్... 'కింగ్ ఆఫ్ ఇండియన్ సినిమా' అని మరోసారి నిరూపించుకున్నారు. ప్రభాస్ అభిమానులు ఈ విజయాన్ని పెద్ద పండుగలా సెలెబ్రేట్ చేసుకుంటున్నారు.
'బాహుబలి: ది ఎపిక్' కలెక్షన్ల జోరు చూస్తుంటే, త్వరలోనే ఇది రూ. 50 కోట్ల మార్కును కూడా దాటే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా ప్రేక్షకులకు కేవలం సినిమానే కాదు, ఒక అద్భుతమైన అనుభవాన్ని మరోసారి అందిస్తోంది.
ఈ వాట్సాప్ నెంబర్‌కు మీ జిల్లాలో రాజకీయ, సామాజిక సమస్యలు వివరాలు పంపండి..
ఏపీ, తెలంగాణలో వివిధ నియోజకవర్గాల్లో నెలకొన్న ప్రజల సమస్యలు, రాజకీయ పరమైన అంశాలను మా దృష్టికి తీసుకు రావాలనుకుంటున్నారా ? మీ సమస్య లేదా మీరు చెప్పే విషయం ఏదైనా క్లుప్తంగా 9490520108 నెంబరుకు వాట్సాప్ ద్వారా తెలియజేయండి.
నోట్ : వ్యక్తిగత సమస్యలు వద్దు
            
                            
                                    
                                            
 క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి