- ( టాలీవుడ్ - ఇండియా హెరాల్డ్ ) . . .

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటించిన “దేవర” సినిమా గ‌త యేడాది బాక్సాఫీస్ వద్ద ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. సముద్ర తీర ప్రాంతం నేపథ్యంగా సాగిన ఈ యాక్షన్ ఎమోషనల్ డ్రామా, ప్రేక్షకులను ఆకట్టుకుంది. నార్త్ నుంచి సౌత్ వరకు విస్తృతంగా హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా, ఓటీటీలో కూడా రికార్డు స్థాయిలో వ్యూస్ సాధించి సూపర్ సక్సెస్‌గా నిలిచింది. ఈ విజయంతో ఇప్పుడు “దేవర పార్ట్-2” పై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే దర్శకుడు కొరటాల శివ సీక్వెల్ స్క్రిప్ట్‌పై పూర్తి శ్రద్ధ పెట్టారట. మొదటి భాగం కంటే మరింత యాక్షన్, ఎమోషన్ కలగలిపి కొత్త స్థాయిలో ఈ కథను తీర్చిదిద్దుతున్నారని సమాచారం. ముఖ్యంగా నార్త్ ఇండియా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి ప్రత్యేకంగా కొన్ని పాత్రలు, సన్నివేశాలు చేర్చినట్లు తెలిసింది.


అందుకోసం ఒక ప్రముఖ బాలీవుడ్ హీరోను ఈ పార్ట్‌లోకి తీసుకురావడానికి చర్చలు జరుగుతున్నాయట. ఆ నటుడి పేరును త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. “దేవర 2”లో జాన్వీ కపూర్ మరోసారి హీరోయిన్‌గా నటించనుంది. అయితే ఈ సీక్వెల్‌లో మరో కొత్త హీరోయిన్ కూడా పరిచయం కానుందని టాక్. దీంతో లవ్ ట్రాక్, ఎమోషనల్ కాన్‌ఫ్లెక్ట్ మ‌రింత హైలెట్ కానున్నాయి. సైఫ్ అలీ ఖాన్ మొదటి భాగంలో విలన్‌గా ఆకట్టుకున్నాడు. ఈ సీక్వెల్‌లో కూడా ఆయన పాత్ర మరింత ప్రభావవంతంగా చూపించబోతున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. కొర‌టాల అంత వ‌ర్క్ చేస్తున్నా .. ఎన్టీఆర్ ఈ సినిమాకు డేట్లు ఎప్పుడు ఇస్తారో క్లారిటీ ఇవ్వ‌డం లేద‌ట‌.


అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాకి విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ కూడా ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. అలాగే శ్రీకాంత్, ప్రకాష్ రాజ్, అజయ్, మురళీ శర్మ వంటి సీనియర్ నటులు కీలక పాత్రల్లో కొనసాగుతున్నారు. జనవరి చివర్లో షూటింగ్ ప్రారంభం కానున్న “దేవర పార్ట్-2” ఎన్టీఆర్ కెరీర్‌లోనే అత్యంత భారీ ప్రాజెక్ట్‌గా రూపుదిద్దుకుంటోంది. మొదటి భాగం సెట్ చేసిన రికార్డులను ఈ సీక్వెల్ ఎలాంటి స్థాయిలో అధిగమిస్తుందో, అభిమానులు ఆతృతగా ఎదురుచూస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: