రామ్‌చరణ్ హీరోగా బుచ్చి బాబు సనా దర్శకత్వంలో రూపొందుతున్న పాన్ ఇండియన్ సినిమా “పెద్ది” నుంచి విడుదలైన తొలి సింగిల్ “ చికిరి చికిరి ” అద్భుతమైన సెన్సేషన్ సృష్టించింది. ఏఆర్ రెహ్మాన్ సంగీతం అందించిన ఈ పాట విడుదలైన క్షణాలకే సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూ రికార్డులు బద్దలు కొడుతోంది. మోహిత్ చౌహాన్ గానం చేసిన ఈ ఉత్సాహభరిత గీతం, గ్రామీణ వాతావరణం, జానీ మాస్టర్ అందించిన ఆకట్టుకునే కొరియోగ్రఫీతో ప్రేక్షకులను ఉర్రూతలూగిస్తోంది. గ్రామీణ స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ చిత్రంలో రామ్‌చరణ్ రఫ్ అండ్ రస్టిక్ లుక్‌లో కనిపించగా, జాన్వీ కపూర్ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. ఇద్దరి కెమిస్ట్రీ ఈ పాటలోనే స్పష్టంగా కనిపిస్తుందని అభిమానులు అంటున్నారు.
ఈ సాంగ్ విడుదలైన 35 గంటల్లోనే 53 మిలియన్ వ్యూస్ దాటేసి, 1.1 మిలియన్ లైక్స్ సాధించడం విశేషం. 24 గంటల్లోనే ఇది భారతదేశంలో అత్యధికంగా వీక్షించిన పాటగా రికార్డు సృష్టించింది. అంతే కాకుండా, ఇది 50 మిలియన్ వ్యూస్ దాటిన వేగవంతమైన ట్రాక్గా నిలిచింది. ఫ్యాన్స్ సోషల్ మీడియాలో #ChikiriChikiri, #PeddiFirstSingle ట్యాగ్‌లతో మ్యూజిక్‌ను వైరల్ చేస్తున్నారు. బుచ్చి బాబు సనా దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం గ్రామీణ క్రీడల నేపథ్యంలో తెరకెక్కుతున్న మాస్ ఎమోషనల్ డ్రామాగా రూపొందుతోంది. రామ్‌చరణ్ గతంలో చేసిన పాత్రలతో పోలిస్తే ఈ సినిమాలో ఆయన పూర్తిగా భిన్నమైన లుక్‌లో కనిపించబోతున్నారు.
టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ ఈ సినిమాకి అదనపు ఆకర్షణగా మారింది. ఈ సినిమాలో కన్నడ సూపర్‌స్టార్ శివరాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతి బాబు తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. వృద్ధి సినిమాస్ సంస్థ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 2026 మార్చి 27న గ్రాండ్ రిలీజ్ కానుంది. “ చికిరి చికిరి ” సక్సెస్‌తో ఇప్పుడు “ పెద్ది ” సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి