ఇటీవల కాలంలో చాలా మంది హీరోయిన్లు తమ వ్యక్తిగత జీవితాలను బహిరంగంగా షేర్ చేయడం, సోషల్ మీడియాలో ఓపెన్‌గా మాట్లాడడం మామూలే అయిపోయింది. కానీ, ఇప్పుడు కొన్ని బ్యూటీస్ తమ లైఫ్‌ డెసిషన్స్‌తో సమాజంలో పెద్ద చర్చను రేపుతున్నారు. ముఖ్యంగా పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ కావడం అనేది చాలామంది ఆడియెన్స్‌కి షాక్‌గా మారింది. ఈ ట్రెండ్‌ను మొదలుపెట్టిన వారిలో ఒకరు హీరోయిన్ ఇలియానా డిక్రూజ్. పెళ్లి చేసుకోకుండానే తల్లి కావడం, ఆ తర్వాత తన బాయ్‌ఫ్రెండ్‌తో సెటిల్ కావడం వంటి విషయాలు అప్పట్లో సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. ఇలియానా లాంటి స్టార్ హీరోయిన్‌నే ఇలా ప్రవర్తిస్తే, ఇక మిగతావాళ్లు ఏం చేస్తారు అని చాలామంది అప్పట్లో కామెంట్స్ చేశారు.


ఇప్పుడు అదే రూట్‌లో మరో టాలీవుడ్ బ్యూటీ కూడా నడుస్తోందట. ఈమె గతంలో రెండు మూడు తెలుగు సినిమాలు చేసి, ఆ తర్వాత బాలీవుడ్‌లో అడుగుపెట్టింది. టాప్ హీరోలతో కూడా నటించింది కానీ బిగ్ హిట్స్ మాత్రం సాధించలేకపోయింది. దాంతో కొంతకాలం తర్వాత సినిమాలకు దూరమై విదేశాల్లో సెటిల్ అయిపోయింది.అయితే తాజాగా, ఈ హీరోయిన్ గురించి ఒక్కసారిగా ఓ సెన్సేషనల్ న్యూస్ బయటకు వచ్చింది. పెళ్లి కాకముందే ప్రెగ్నెంట్ అయిందట! సోషల్ మీడియాలో ఈ వార్తలు ప్రస్తుతం వేగంగా వైరల్ అవుతున్నాయి. ఫారిన్ కంట్రీలో ఉంటూ, డేటింగ్ కల్చర్ పేరుతో తాను లైఫ్‌ని బాగా ఎంజాయ్ చేసిందని, ఆ ఫలితంగా ఇప్పుడు ప్రెగ్నెంట్ అయిపోయిందని టాక్.



ఇక డెలివరీ అయిన తర్వాత మాత్రమే పెళ్లి చేసుకోవాలని ఈ బ్యూటీ నిర్ణయించుకుందట. ప్రస్తుతం ఆమె బాయ్‌ఫ్రెండ్ ఫ్యామిలీతో చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే అధికారికంగా పెళ్లి రిజిస్ట్రేషన్ కూడా జరగబోతుందని సమాచారం.ఈ వార్తలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో అయితే చర్చలు చెలరేగిపోయాయి.కొంతమంది నెటిజన్లు “ఇది వారి వ్యక్తిగత నిర్ణయం, ఎవరికీ హానీ లేదు” అని సపోర్ట్ చేస్తుండగా, మరికొందరు మాత్రం “ఇలాంటి ట్రెండ్స్ సమాజానికి చెడు ఉదాహరణ చూపుతున్నాయి” అంటూ మండిపడుతున్నారు.


ప్రముఖులు కూడా ఈ విషయంపై స్పందిస్తున్నారు. “పెళ్లి అనేది ఒక పవిత్రమైన బంధం. దానిని బలపరచే దశలోనే గర్భం అనేది అర్థవంతం అవుతుంది. కానీ ఇప్పుడు కొందరు స్టార్‌లు పెళ్లి లేకుండానే గర్భం దాల్చి, దాన్ని లైట్‌గా తీసుకుంటున్నారు. ఇది సమాజం మీద చెడు ప్రభావం చూపుతుంది” అని కొంతమంది సీనియర్ నటులు, రచయితలు కామెంట్ చేస్తున్నారు.అయితే మరోవైపు కొంతమంది మోడర్న్ ఆడియెన్స్ మాత్రం “ఇది న్యూ జనరేషన్ లైఫ్‌స్టైల్, అందులో తప్పేం లేదు” అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: