టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందుతున్న అఖండ 2 అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికి తెలిసిందే. ఇప్పటివరకు బాలయ్య , బోయపాటి కాంబోలో సింహా , లెజెండ్ , అఖండ అనే మూడు సినిమాలు రూపొందాయి. ఈ మూడు సినిమాలు కూడా అద్భుతమైన విషయాలను అందుకున్నాయి. ఇక ఇప్పటికే వీరి కాంబోలో రూపొందిన మూడు సినిమాలు మంచి విజయాలను సాధించి ఉండడం , ఇక ఈ సినిమా భారీ విజయం సాధించిన అఖండ 2 మూవీ కి కొనసాగింపుగా రూపొందుతూ ఉండడంతో అఖండ 2 మూవీ పై బాలయ్య అభిమానులతో పాటు మామూలు తెలుగు ప్రేక్షకుల్లో కూడా మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

అఖండ 2 మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల జగనున్నట్లు ఈ మూవీ బృందం వారు చాలా రోజుల క్రితమే అధికారికంగా ప్రకటించారు. ఇది ఇలా ఉంటే ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన థియేటర్ హక్కులను అమ్మి వేస్తూ వస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగా తాజాగా ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన ఓవర్ సిస్ హక్కులను అమ్మి వేసినట్లు తెలుస్తోంది. ఈ మూవీ యొక్క ఓవర్ సిస్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడు పోయినట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఓవర్ సిస్ హక్కులను మోక్ష మూవీస్ మరియు సినీ గెలాక్సీ మరియు శ్రీ వైష్ణవి ఎంటర్టైన్మెంట్ సంస్థల వారు ఏకంగా 15 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. ఇలా ఈ సినిమా యొక్క ఓవర్ సిస్ హక్కులు అత్యంత భారీ ధరకు అమ్ముడు పోయినట్లు సమాచారం. ప్రస్తుతానికి ప్రేక్షకుల్లో మంచి అంచనాలు కలిగి ఉన్న ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ స్థాయి విజయాన్ని సొంతం చేసుకుంటుందో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: