తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న నటులలో ఒకరు అయినటువంటి సుదీర్ బాబు తాజాగా జటాధర అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ విడుదలకు ముందు ఈ మూవీ యూనిట్ వారు ఈ సినిమాకు సంబంధించిన కొన్ని ప్రచార చిత్రాలను విడుదల చేశారు. అవి ప్రేక్షకులను బాగా ఆకట్టుకోవడంతో ఈ మూవీ పై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. అలా మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ వచ్చింది. ఆలా ఈ మూవీ కి నెగిటివ్ టాక్ రావడంతో ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర పెద్ద స్థాయి కలెక్షన్లను వసూలు చేయలేక పోతుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన మూడు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ మూడు రోజుల్లో ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఎన్ని కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.

3 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 58 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 22 లక్షలు , ఆంధ్ర లో 75 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా మూడు రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ సినిమాకు 1.55 కోట్ల షేర్ ... 2.90 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక మూడు రోజుల్లో ఈ మూవీ కి కర్ణాటక , రెస్ట్ ఆఫ్ ఇండియా , ఓవర్ సిస్ లలో కలుపుకొని 25 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా మూడు రోజుల్లో 1.80 కోట్ల షేర్ ... 3.55 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఈ మూవీ 4.60 కోట్ల రేంజ్ లో షేర్ కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది. దానితో ఈ మూవీ మరో 2.8 కోట్ల షేర్ కలెక్షన్లను సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది. ఇలా ఈ మూవీ కి నెగిటివ్ టాక్ వచ్చినా కూడా మంచి కలెక్షన్లను వసూలు చేస్తుంది. దానితో చాలా మంది ఈ మూవీ కి మంచి టాక్ వచ్చి ఉంటే అద్భుతమైన కలెక్షన్లను వసూలు చేసి సూపర్ హిట్ను అందుకునేది అని అభిప్రాయ పడుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: