ప్రస్తుత జనరేషన్ కి షోలే సినిమా అంటే తెలియదు.. కానీ 90స్ లో పుట్టిన వారికి షోలే మూవీ గురించి క్లియర్గా తెలిసే ఉంటుంది.. అప్పట్లో ఈ మూవీ సృష్టించిన సంచలనాలు అంతా ఇంతా కాదు.. ఎలాంటి టెక్నాలజీ, సోషల్ మీడియా లేని సమయంలోనే ఈ సినిమా అద్భుతమైన హిట్ సాధించింది.. అప్పట్లో ఈ చిత్రానికి కేవలం మూడు కోట్ల బడ్జెట్ పెడితే 35 కోట్లు సంపాదించి భారతదేశంలోనే పెద్ద ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. అయితే ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాలు వస్తున్నాయి.టికెట్లు రేట్లు పెరిగి కొన్ని చిత్రాలు భారీ బడ్జెట్ సంపాదిస్తున్నాయి. కానీ ఆ సమయంలో టికెట్ల రేట్లు చాలా తక్కువ.. ఆ టైంలో కూడా 35 కోట్లు సంపాదించడం అంటే మామూలు విషయం కాదు.. అంటే ఇప్పుడు వచ్చిన బాహుబలి,పుష్ప వంటి సినిమాల కంటే ఎక్కువ సాధించినట్టు..
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి