టాలీవుడ్‌లో సీనియర్ హీరోలతో హీరోయిన్ ఎంపిక డైరెక్టర్లకు పెద్ద తలనొప్పిగా మారింది. ఎందుకంటే చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి అగ్రహీరోల వయస్సు ఇప్పటికే 60 దాటిపోయింది. ఈ తరహా వయసులో ఉన్న హీరోలకి సరిపోయే హీరోయిన్‌ను ఎంపిక చేయడం అంత ఈజీ విషయం కాదు. యంగ్ హీరోయిన్స్‌తో జోడీ కట్టిస్తే వయస్సు తేడా స్పష్టంగా కనిపిస్తుందనే విమర్శలు వస్తుంటాయి. మరోవైపు వారి వయస్సు ఉన్న లేదా సీనియర్ నటీమణులు అయితే గ్లామర్ పరంగా తగ్గిపోతుంది. అందుకే చాలామంది దర్శకులు, నిర్మాతలు ఒకే హీరోయిన్లను రిపీట్ చేస్తూ వస్తున్నారు.
ఈ నేపథ్యంలో తాజాగా మీనాక్షి చౌదరి చేసిన ప్రకటన సినీ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. అది కూడా ఒక కొత్త అనుభవంగా భావిస్తానని మీనాక్షి వెల్లడించింది. ఈ నిర్ణయం ఫిల్మ్ మేకర్లకు కొంత ఊరటగా మారింది. ఎందుకంటే ఇప్పుడు ఎక్కువగా 30 సంవత్సరాల లోపు ఉన్న హీరోయిన్లు సీనియర్ హీరోలతో జోడీ కట్టడానికి ముందుకు రావడం లేదు. కానీ మీనాక్షి మాత్రం ఆ ఆప్షన్‌ను సానుకూలంగా తీసుకోవడం గమనార్హం. మీనాక్షి చౌదరి తన కెరీర్‌లో ఇప్పటివరకు అవకాశాలు ఎలా వచ్చినా వాటిని వదులుకోలేదు. ‘లక్కీ భాస్కర్’ సినిమాలో పిల్లల తల్లి పాత్రలో కనిపించి ప్రేక్షకుల మనసు గెలుచుకుంది.
‘సంక్రాంతి వస్తున్నాం’ చిత్రంలో వెంకటేశ్ సరసన గర్ల్‌ఫ్రెండ్ పాత్రలో నటించి ఆకట్టుకుంది. ఈ రెండు విభిన్నమైన పాత్రలు ఆమె నటనలోని విస్తృతతను చూపించాయి. యంగ్ హీరోలతో మాత్రమే నటించాలని కట్టుబడి కూర్చోలేదు ఆమె. మంచి కథ, బలమైన పాత్ర ఉంటే చాలు అని భావించి ముందుకు సాగడం ఆమె మేచ్యూరిటీని చూపిస్తోంది. మీనాక్షి లాగే శ్రీలీల కూడా ఇప్పుడు సీనియర్ హీరోలతో జోడీగా నటించడానికి సై అంటోంది. ఇప్పటికే రవితేజతో ‘ధమాకా’లో ఒకసారి, తాజాగా ‘మాస్ జాతర’లో రెండోసారి జోడీ కట్టింది. ప్రస్తుతం శ్రీలీల వయస్సు కేవలం 24 ఏళ్లు మాత్రమే. అయినా పెద్ద హీరోలతో నటించడంలో ఎలాంటి సంకోచం లేకుండా ముందుకు రావడం ఇప్పుడు సరికొత్త ట్రెండింగ్ న్యూస్ అయ్యింది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి