టాలీవుడ్ ప్రముఖ హీరోయిన్లలో ఒకరైన ఆదాశర్మ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఆదాశర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ది కేరళ స్టోరీ 2023లో రిలీజ్ కాగా ఈ మూవీ రిలీజ్ టైంలో దేశవ్యాప్తంగా ఈ మూవీ గురించి చర్చ జరిగింది. ఈ మూవీ రిలీజ్ టైంలో దేశంలో సగం మంది నన్ను చంపాలని చూశారని ఆమె అన్నారు. రిస్క్ ఉన్న రోల్స్ చేసినప్పుడే కెరీర్ కు మరింత వాల్యూ పెరుగుతుందని ఆమె అన్నారు.
1920 మూవీతో నేను ఇండస్ట్రీలో అడుగు పెట్టానని ఆమె పేర్కొన్నారు. నా తొలి సినిమానే చాలా పెద్ద రిస్క్ అని నేను భావిస్తానని ఆదాశర్మ కామెంట్లు చేశారు. ది కేరళ స్టోరీ మూవీ రిలీజ్ అయ్యే వరకు మంచి స్క్రిప్ట్ ఎప్పుడు వస్తుందా అని నేను ఎదురు చూశానని ఆమె పేర్కొన్నారు. ఆ సినిమా తర్వాత నా కెరీర్ మారిపోయిందని ఆదాశర్మ వెల్లడించారు. ఆ మూవీ తర్వాత నేను బస్టర్ : ది నక్సల్ స్టోరీ చేశానని ఆమె తెలిపారు.
ఈ రెండు సినిమాలు విడుదలైన సమయంలో నేను చాలా బెదిరింపులు ఎదుర్కొన్నానని ఆమె చెప్పుకొచ్చారు. ఆ సమయంలో దేశంలో సగం మంది నన్ను చంపాలని కోరుకున్నారని మిగతా సగం మంది నాపై ప్రశంసలు కురిపించారని ఆదాశర్మ అన్నారు. వారంతా నన్ను రక్షించారని ఆమె కామెంట్లు చేశారు.
స్క్రిప్ట్ సెలక్షన్ గురించి అదాశర్మ మాట్లాడుతూ ఛాలెంజింగ్ రోల్స్ ను మాత్రమే తాను ఇష్టపడతానని అన్నారు. పాత్రలో ఎమోషన్ లేకపోతే నాకు నచ్చదని యాక్షన్ సీన్స్ ఉండాలని నేను చేసే రోల్ లో ఎమోషనల్ టచ్ ఉండాలని ఆదా శర్మ కామెంట్స్ చేశారు. నేను చేసిన రోల్ చూసి నా ఫ్యామిలీ ఒకింత టెన్షన్ పడాలని అలా జరగకపోతే ఆ రోల్ చేయడం ఎందుకు అని నాకు అనిపిస్తుందని ఆదాశర్మ చెప్పుకొచ్చారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి