నందమూరి బాలకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తెలుగు సినిమా పరిశ్రమలో సీనియర్ ఎన్టీఆర్ వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపును సృష్టించుకున్న నటుడు బాలయ్య.. వరుసగా అందిస్తున్న మాస్ అండ్ యాక్షన్ సినిమాలతో ఇప్పటికీ యువ హీరోలకు పోటీగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ఆయన అఖండ 2 సినిమాతో బిజీగా ఉన్నారు. ఈ భారీ ప్రాజెక్ట్‌పై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా ఉన్నాయి.ఈ చిత్రానికి సంబంధించి “తాండవం” లిరికల్ వీడియోను ముంబైలో ఘనంగా ఆవిష్కరించారు. ఈ ఈవెంట్‌కు నందమూరి బాలయ్య హాజరై అభిమానులతో సందడి చేశారు. బాలయ్యను చూసిన అభిమానులు ఉత్సాహంతో స్టేజ్‌వైపు పరుగెత్తుకుంటూ వచ్చి ఫోటోలు దిగేందుకు ప్రయత్నించారు. ఒక్కసారిగా పెద్ద సంఖ్యలో అభిమానులు స్టేజ్‌పైకి ఎగబడ్డారు.


దీంతో బాలయ్య ఒక్కసారిగా సీరియస్ అయ్యారు. “అలా మీదపడిపోతారు ఎందుకు? జాగ్రత్తగా రండి!” అంటూ బాలయ్య కాస్త కోపంతో అభిమానులపై కన్నెర్ర చేశారు. ఆ సమయంలో అక్కడ ఉన్నవారందరూ ఒక్కసారిగా షాక్‌ అయ్యారు. ఈ సంఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో క్షణాల్లో వైరల్‌గా మారింది.బాలయ్య అభిమానులపై సీరియస్ అవడం ఇదొకటి మాత్రమే కాదు. గతంలో కూడా ఇటువంటి అనేక సందర్భాల్లో ఆయన అభిమానులకు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించిన వీడియోలు వైరల్ అయ్యాయి. అభిమానులపై ప్రేమ ఉన్నా, వారి భద్రత విషయంలో మాత్రం బాలయ్య ఎప్పుడూ కఠినంగా స్పందించడం తెలిసిందే.



ఇదిలా ఉండగా, నందమూరి బాలయ్య నటించిన అఖండ 2 సినిమా డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. దర్శకుడు బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని అత్యంత గ్రాండ్‌గా, భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, శక్తివంతమైన డ్రామాతో తెరకెక్కించినట్లు సమాచారం. ‘అఖండ’ ఇచ్చిన బ్లాక్‌బస్టర్ విజయంతో భాగంగా, ఈ సీక్వెల్‌పై అభిమానుల్లో భారీ హైప్ నెలకొంది.బాలయ్య అఘోర పాత్రలో తిరిగి ఎలా అలరిస్తారన్న ఆసక్తి, తాండవం సాంగ్‌తో మరింత పెరిగింది. సినిమా విడుదలకు ముందు నుంచే బాలయ్య మార్క్ మాస్ హవా కనిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: