టాలీవుడ్ నటుడు సుధీర్ బాబు గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన ఇప్పటివరకు తన కెరీర్లో చాలా సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు. కానీ ఈయనకు అత్యంత తక్కువ సినిమాలతో మాత్రమే బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విజయాలు దక్కాయి. ఈయనకు అద్భుతమైన విజయం చాలా సంవత్సరాల క్రితం విడుదల అయిన ప్రేమ కథ చిత్రం మూవీ ద్వారా దక్కింది. ఈ మూవీ ఈయన కెరియర్ లోనే బెస్ట్ మూవీ గా ఉంది. ఈ సినిమా విడుదల అయ్యి ఇప్పటికే చాలా సంవత్సరాలు అవుతుంది. ఈ సినిమా తర్వాత తీయన అనేక సినిమాలతో ప్రేక్షకులను పలకరించాడు.

కానీ ఏ సినిమా స్థాయి విజయం మాత్రం ఈయనకు ఇప్పటివరకు దక్కలేదు. తాజాగా సుధీర్ బాబు "జటాధర" అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ సినిమా కొన్ని రోజుల క్రితమే థియేటర్లలో విడుదల అయింది. ఇకపోతే ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోరమైన నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ సినిమా ఏ మాత్రం బాక్సా ఫీస్ దగ్గర ఇంపాక్ట్ చూపలేదు అని , ఈ సినిమా కనీసం వసూలను కూడా రాబట్టలేదు అని చాలామంది అనుకున్నారు. కానీ ఈ మూవీ నెగటివ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్లను రాబట్టినట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఎన్ని కోట్ల కలెక్షన్లు వచ్చాయి అనే విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. 

మూవీ బృందం వారు ఏ సినిమా ఏడు రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 7.45 కోట్ల కలెక్షన్లను  వసూలు చేసినట్లు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను విడుదల చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో సూపర్ గా వైరల్ అవుతుంది. ఈ మూవీ కి నెగటివ్ టాక్ తో కూడా మంచి కలెక్షన్లు దక్కడంతో ఈ సినిమాకు మంచి పాజిటివ్ టాక్ వచ్చి ఉండి ఉంటే అద్భుతమైన కలెక్షన్లను ఈ సినిమా బాక్సా ఫీస్ దగ్గర వాసులు చేసేది అని చాలా మంది భావిస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: