సినిమా ఇండస్ట్రీbలో ఏ హీరోకు అయిన వరుస పెట్టి భారీ అపజయాలు వస్తున్నాయో ఆ హీరో క్రేజ్ సాధారణంగా తగ్గిపోతూ ఉంటుంది. అలాంటి హీరో నటించిన సినిమాల నుండి ప్రమోషనల్ కంటెంట్ వచ్చి అది బాగున్నట్లయితే ఆ సినిమాపై కాస్త అంచనాలు పెరుగుతాయి. కాని వరుస ప్లాపుల్లో ఉన్న హీరో నటించిన సినిమాలకు విడుదలకు చాలా రోజుల ముందే పెద్ద ఎత్తున బిజినెస్ మాత్రం జరగదు. కానీ కొంత మంది హీరోలకు మాత్రం వరుస పెట్టి అపజయాలు వస్తున్న వారి సినిమాలపై ప్రేక్షకుల్లో నమ్మకం ఉండడం వల్ల వారి సినిమాల విడుదలకు ముందే పెద్ద ఎత్తున బిజినెస్ జరుగుతూ ఉంటుంది.

ఇక తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన గుర్తింపు కలిగిన హీరోలలో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఈ మధ్య కాలంలో రవితేజ నటించిన సినిమాలు వరుస పెట్టి అపజయాలను అందుకుంటున్నాయి. తాజాగా ఈయన మాస్ జాతర అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా కూడా బాక్స్ ఆఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయింది. ఇలా వరుస ఆపజయాలతో డీలా పడిపోయిన రవితేజ ప్రస్తుతం కిషోర్ తిరుమల దర్శకత్వంలో రూపొందుతున్న భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ మూవీ లో ఆశికా రంగనాథ్ , డింపుల్ హయాతి హీరోయిన్లుగా నటిస్తున్నారు.

ఈ సినిమాను వచ్చే సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయనున్నట్లు ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఈ సినిమా విడుదలకు చాలా రోజులు ఉంది. కానీ ఈ మూవీ కి సంబంధించిన ఉత్తరాంధ్ర థియేటర్ హక్కులను శ్రీ గాయత్రీ దేవి ఫిలిమ్స్ సంస్థ వారు ఇప్పటికే దక్కించుకున్నట్లు తెలుస్తోంది. ఇలా వరుస ప్లాపుల్లో ఉన్న రవితేజ సినిమాకు సంబంధించిన ఉత్తరాంధ్ర థియేటర్ హక్కుల ఆ మూవీ విడుదలకు చాలా రోజుల ముందే అమ్ముడు పోవడంతో ఇది రవితేజ క్రేజ్ అంటే అని ఆయన అభిమానులు ఫుల్ ఖుషి అవుతున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

Rt