తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపున సంపాదించుకున్న నటులలో నితిన్ ఒకరు. ఈయన జయం అనే మూవీ తో నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. ఈ మూవీతోనే మంచి విజయాన్ని అందుకున్నాడు. మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఆ తర్వాత కూడా కొంత కాలం పాటు ఈయన నటించిన సినిమాలు మంచి విజయాలు సాధించడంతో అత్యంత తక్కువ కాలం లోనే ఈయనకు తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పాటు ఈయనకు వరుస పెట్టి ఆపజయాలు దక్కాయి. దానితో ఈయన కెరియర్ కొన్ని సంవత్సరాల పాటు అత్యంత డౌన్లో కొనసాగింది. అలాంటి సమయం లోనే ఈయన ఇష్క్ అనే మూవీ తో మంచి విజయాన్ని అందుకొని అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చాడు. ఆ తర్వాత ఈయన మళ్లీ కొంత కాలం పాటు మంచి విజయాలను అందుకొని అద్భుతమైన జోష్లో కెరియర్ను ముందుకు సాగించాడు. ఇక మళ్ళీ ఈయన వరుస పెట్టి భారీ ఆపజయాలను అందుకుంటున్నాడు. ఈ మధ్య కాలంలో నితిన్ నటించిన చాలా సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. నితిన్ కొంత కాలం క్రితం తమ్ముడు అనే సినిమాలో హీరో గా నటించాడు.

సినిమా విడుదలకు ముందు నితిన్ తన తదుపరి మూవీలుగా అనేక సినిమాలను ఓకే చేసుకున్నాడు అని వార్తలు వచ్చాయి. అందులో భాగంగా బలగం సినిమా దర్శకుడు అయినటువంటి వేణు దర్శకత్వంలో దిల్ రాజు బ్యానర్లో ఎల్లమ్మ అనే టైటిల్ తో రూపొందబోయే సినిమాలో నితిన్ హీరోగా నటించబోతున్నాడు అని వార్తలు వచ్చాయి. అదే విధంగా దిల్ రాజు కూడా మరి కొంత కాలం లోనే నితిన్ తో సినిమా స్టార్ట్ చేయనున్నట్లు ప్రకటించాడు. ఇక ఆ తర్వాత విక్రమ్ కే కుమార్ దర్శకత్వంలో ఓ సినిమాలోనూ , 90's వెబ్ సిరీస్ దర్శకుడు ఆదిత్య హాసన్ దర్శకత్వంలో నితిన్ ఓ సినిమాలు నటించనున్నట్లు వార్తలు వచ్చాయి. కానీ తమ్ముడు విడుదల అయ్యి అపజయం అందుకున్న తర్వాత ఈ వార్తలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు లేకుండా పోయాయి. మరి నితిన్ తన తదుపరి మూవీలను ఎవరితో చేస్తాడో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: