కోటి పాతిక లక్షల బడ్జెట్... నాలుగు కోట్ల వేట! .. ఈ సినిమాను అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున సోదరుడు సురేందర్ నిర్మించారు. ఆ కాలంలో ఈ సినిమా బడ్జెట్ కేవలం రూ.1.15 కోట్లు మాత్రమే! కానీ ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా రూ. 4 కోట్లకు పైగా వసూలు చేసి, అప్పట్లో తెలుగు సినిమా ప్రపంచంలో రికార్డులు క్రియేట్ చేసింది. ఈ బడ్జెట్, కలెక్షన్ల తేడా చూస్తే... ఆ రోజుల్లోనే 'శివ' ఎంత పెద్ద బాక్సాఫీస్ సునామీ సృష్టించిందో అర్థమవుతుంది! ఆర్జీవీ పారితోషికం లీక్... నమ్మశక్యం కాదు! .. ఈ సినిమాకు సంబంధించిన అత్యంత ఆసక్తికర విషయం ఏమిటంటే... నమ్మశక్యం కాని స్థాయిలో దర్శకుడు ఆర్జీవీ తీసుకున్న రెమ్యునరేషన్! ఇది ఆయనకు తొలి సినిమా కావడం విశేషం.
RGV కేవలం రూ. 50 వేల నుంచి రూ. లక్ష వరకు పారితోషికం తీసుకుని, దానికి అదనంగా లాభాల్లో 5 శాతం వాటా తీసుకున్నారట! ఈ లెక్క చూస్తే... ఈ రోజు కోట్లు తీసుకునే RGV కెరీర్ ఇంత నిరాడంబరంగా మొదలైందా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఇక నటీనటుల పారితోషికాల విషయానికొస్తే... అప్పట్లో నాగార్జున ఒక్కో సినిమాకు రూ. 10 లక్షలు వసూలు చేసేవారు. శివ సినిమాకు ఎంత తీసుకున్నారనే క్లారిటీ లేకపోయినా, హీరోయిన్ అమల రూ. 3 లక్షలు తీసుకున్నారు. కీలక పాత్రల్లో నటించిన జేడీ చక్రవర్తి రూ. 1 లక్ష, రఘువరన్ రూ. 1.5 లక్ష వరకు పారితోషికంగా తీసుకున్నారట. మొత్తంగా, అతి తక్కువ ఖర్చుతో, అద్భుతమైన సృజనాత్మకతతో ఇండియన్ సినిమా రూపురేఖలను మార్చిన 'శివ' సినిమాను... మళ్ళీ తెరపై చూసేందుకు అభిమానులు ఉర్రూతలూగుతున్నారు!
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి