ఇంకా కొద్ది గంటల వ్యవధి మాత్రమే మిగిలి ఉంది… కానీ ఆ కొద్ది గంటల కోసం మొత్తం ఇండియన్ సినీ ప్రపంచం ఊపిరి బిగపట్టుకుని ఎదురు చూస్తోంది. ఇండియన్ సినిమా చరిత్రలోనే అత్యంత భారీ లాంచ్ ఈవెంట్‌గా నిలిచే ‘గ్లోబ్ ట్రాటర్’—అంటే శ్శంభ్29 టైటిల్ రివీల్ ఈవెంట్—ఈరోజు సాయంత్రం రామోజీ ఫిల్మ్ సిటీలో అద్భుతంగా, అపూర్వమైన విధంగా జరగనుంది. సూపర్ స్టార్ మహేష్ బాబు – గ్లోబల్ సినిమాటిక్ లెజెండ్ ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్ అంటేనే ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్‌లో హైప్‌కు ఎండ్ కార్డ్ లేదు. అలాంటి మ్యాజిక్ కాంబో నుంచి వస్తున్న ‘గ్లోబ్ ట్రాటర్’పై క్రేజ్ ఇప్పుడు టాప్ గేర్‌లో ఉంది. ఈవెంట్‌కు సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్ కూడా సోష‌ల్ మీడియాలో ట్రెండింగ్‌లోకి వెళ్లిపోతున్న పరిస్థితి.

రామోజీ ఫిల్మ్ సిటీ మొత్తం ‘గ్లోబ్ ట్రాటర్’ లుక్‌లోకి :

ఈవెంట్ కోసం రామోజీ ఫిల్మ్ సిటీని ప్రత్యేకంగా మార్చిన విధానం చూడడానికి ఏకంగా ఇంటర్నేషనల్ మూవీ ప్రీమియర్ లా ఉందని అక్కడికి వెళ్లిన వాళ్లు చెబుతున్నారు. ఎంట్రీ ఆర్చ్‌లు, ఫుట్‌ప్రింట్ లైటింగ్, మూవీ కాన్సెప్ట్‌ను రిఫ్లెక్ట్ చేసే భారీ సెట్స్,స్పెషల్ ఎఫెక్ట్స్‌తో డిజైన్ చేసిన స్టేజ్..ఇవి అన్నీ చూసిన అభిమానులు ఇప్పుడే షాకవుతున్నారు. ముఖ్యంగా, ఈ ఈవెంట్‌కి ఇచ్చిన పాస్‌పోర్ట్ స్టైల్ పాసులు—వాటిలోని డిజైన్, డీటైల్, సీక్రెట్ కోడ్స్—ఫ్యాన్స్‌కి ఇంకా ఎన్నో సందేహాలు, ఎగ్జైట్మెంట్‌లు పెంచేశాయి. రాజమౌళి ప్లాన్‌దే కదా… కుతూహలం క్రియేట్ చేయడంలో ఆయనకు పోటీ ఎవరు లేరు.

ఈ మొత్తం ఈవెంట్‌లో సింగిల్ మోస్ట్ హైలైట్ ఏంటంటే… అది మహేష్ బాబు ఎంట్రీ. ఇండస్ట్రీలో ఇప్పటి వరకు ఏ హీరోకీ ఇవ్వని విధంగా, పూర్తిగా ఎక్స్‌పెరిమెంటల్‌గా, ప్రపంచ సినిమాల్లో చూసే స్థాయిలో ఒక ప్రత్యేక డిజైన్ చేసిన ఎంట్రీని రాజమౌళి – ఎస్‌.ఎస్‌. కార్తికేయ కలిసి ప్లాన్ చేశారట. వాళ్లు పనిచేసే క్రియేటివ్ లెవల్ తెలిసి ఫ్యాన్స్ ఇప్పటికే ఎగ్జైట్మెంట్‌లో మునిగిపోయారు. అన్నింటికన్నా సీక్రెట్‌గా ఉంచిన ఈ ఎంట్రీ—ఫ్యాన్స్‌ని కేకలు వేయించేలా, సోషల్ మీడియాలో నిమిషాల్లో వైరల్ అయ్యేలా,ఈవెంట్ మొత్తానికి ‘సెంటర్ ఆఫ్ అట్రాక్షన్’ అయ్యేలా ప్లాన్ అయిందని లోపలి సమాచారం. మహేష్ బాబు స్క్రీన్ మీదే కాదు… ఈవెంట్‌లో కూడా హాలీవుడ్ రేంజ్‌లో దర్శనమివ్వబోతున్నారని టాక్.


మరింత సమాచారం తెలుసుకోండి: