సూపర్ స్టార్ మహేశ్ బాబు – దర్శకుడు ఎస్‌.ఎస్‌. రాజమౌళి కాంబినేషన్‌లో రూపొందుతున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ఫిల్మ్‌పై దేశవ్యాప్తంగా అంచనాలు ఎంతలా పెరిగిపోయాయో చెప్పాల్సిన పని లేదు. ఈ చిత్రానికి సంబంధించిన ప్రతి చిన్న అప్‌డేట్‌ కోసం కోట్లాది అభిమానులు ఎదురు చూస్తుంటే, ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో నిర్వహించిన ఈవెంట్‌ మాత్రం ఆ అంచనాలను ఆకాశమే హద్దు అన్నట్టుగా పెంచేసింది.ఈ ఈవెంట్‌ను దేశంలోనే కాక, అంతర్జాతీయంగా కూడా ఒక వేరే స్థాయికి తీసుకెళ్లేందుకు నిర్వాహకులు ఎలాంటి రాజీ పడలేదని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. రామోజీ ఫిల్మ్ సిటీలో జరగబోతున్న ఈ గ్ర్యాండ్ ఈవెంట్ కోసం సుమారు 35 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్టు తెలిసింది. సెట్స్ డిజైన్‌ నుంచి లైటింగ్స్‌, హై-టెక్ విజువల్ ప్రెజెంటేషన్స్‌, ప్రత్యేక బ్లూప్రింట్ షోకేస్‌, విదేశీ టెక్నీషియన్ల ఎంగేజ్‌మెంట్ ..ఎలీడీ స్క్రీన్ వరకు ఒక్కో అంశం కూడా అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైందట.

అదే సమయంలో—ఈ ఈవెంట్‌పై ఇండస్ట్రీలో మరో హాట్ టాపిక్ వినిపిస్తుంది. డిజిటల్ రైట్స్, లైవ్ స్ట్రీమింగ్ హక్కుల కోసం జియో మరియు హాట్‌స్టార్ మధ్య భారీ పోటీ నెలకొన్నట్టు సమాచారం. చివరకు ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ హక్కులను 57 కోట్ల రూపాయలకు కొనుగోలు చేశారనే వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఒక సినిమా ప్రమోషనల్ ఈవెంట్‌ కోసం ఇంత భారీ మొత్తంలో డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్ చెల్లించడం ఇదే మొదటిసారి కావడంతో ఈ వార్త చర్చనీయాంశంగా మారింది.ఈవెంట్ హక్కుల డీల్ నిజమే అయితే, దాని వెనుక ఉన్న ప్రధాన కారణం రాజమౌళి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్, గ్లోబల్ మార్కెట్‌లో మహేశ్ బాబు బ్రాండ్ విలువ, అలాగే ఈ సినిమా పై నిర్మాణ దశ నుంచే ఏర్పడుతున్న అంతర్జాతీయ హైప్ అన్నది స్పష్టమవుతోంది.

అంతేకాదు—ఈ ఈవెంట్ లో చూపించబోతున్న కాన్సెప్ట్ వీడియోలు, ఖండాంతరాలను దాటి ప్రయాణించే కథ గా.. హాలీవుడ్ స్టైల్ యాక్షన్ సెటప్గా చేసి సినిమా మీద భారీ అంచనాలు పెంచేలా ఉండబోతున్నాయట.ప్రస్తుతం ఈ వార్త అధికారికంగా ప్రకటించకపోయినా… ఇండస్ట్రీలో వినిపిస్తున్న బజ్ చూస్తుంటే, ‘గ్లోబ్ ట్రాటర్’ ఈవెంట్ నిజంగానే భారతీయ సినిమా ప్రొమోషన్స్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేసినట్టే కనిపిస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: