ఫ్యాన్స్ అందరూ ఎదురుచూస్తున్న ఆ 3 నిమిషాల వీడియో!
ఈరోజు జరగబోయే ఈవెంట్‌లో ప్రధాన హైలైట్‌గా నిలవబోయేది ఆ మూడు నిమిషాల ఎక్స్‌క్లూజివ్ వీడియో. ఈ వీడియోలో—సినిమా అసలైన టైటిల్ రివీల్..మహేష్ బాబు ఫస్ట్ లుక్..ప్రియాంక చోప్రా పాత్రకు సంబంధించిన గ్లింప్స్..స్టోరీ ఐడియా – ప్రధాన కాన్సెప్ట్..రాజమౌళి రూపొందించిన అడ్వెంచర్ ప్రపంచానికి సంబంధించిన ఒక చిన్న టేస్ట్..అన్నింటినీ ఒకే వీడియోలో చూపించబోతున్నారని టాలీవుడ్ సర్కిల్స్ చెబుతున్నాయి. మహేష్ ఎలాంటి లుక్‌లో కనిపించబోతున్నారు?”, “రాజమౌళి విజన్ ఎంతవరకు కొత్తగా ఉంటుంది?” అన్న అంశాలపై ఫ్యాన్స్ భారీగా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నారు. ఈ 3 నిమిషాలు ఈఇండియన్ సినిమా ఫ్యూచర్ ను డిఫైన్ చేస్తాయన్నంత హీట్ నెలకొంది.
లాస్ట్ మినిట్‌లో రాజమౌళికి షాక్?
అయితే ఈ ఎక్స్‌క్లూజివ్ వీడియో విషయంలో లాస్ట్ మినిట్‌లో కొన్ని టెక్నికల్ సమస్యలు తలెత్తినట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. అందుతున్న సమాచారం ప్రకారం— వీడియోలో రాజమౌళి ప్లాన్ చేసిన కీలక విజువల్ ఎలిమెంట్స్ కొన్ని మిస్సయ్యాయి.వాటిని ఇప్పుడు వెంటనే సెట్ చేయడం సాధ్యం కావడం లేదట. ఈవెంట్ స్టార్ట్ అయ్యే వరకు టైమ్ చాలా తక్కువగా ఉండటంతో, రీ-వర్క్‌కు అవకాశం లేకుండా పోయింది. ఈ కారణంగా తప్పనిసరిగా వీడియోను అలాగే రిలీజ్ చేయడానికి జక్కన్న ఓకే చెప్పారట. రాజమౌళి లాంటి పర్ఫెక్షనిస్ట్‌కు ఇది చిన్న విషయం కాదు. ఆయనకు, ఆయన వర్క్‌పై నమ్మకంతో ఎదురు చూస్తున్న అభిమానులకు ఇది ఒక చిన్న నిరాశగానే చెప్పాలి. ఈ టెక్నికల్ ఇష్యూలు ఉన్నా కూడా ఫ్యాన్స్ మాత్రం ఎలాంటి టెన్షన్ పడటం లేదు.“జక్కన్న నుండి వస్తే అది హాఫ్ వీడియోనైనా బ్లాక్‌బస్టర్‌గానే ఉంటుంది” అన్నారు సోషల్ మీడియాలో పలువురు. ఇండియన్ సినిమా స్టాండర్డ్స్‌ను ప్రపంచానికి చూపించిన దర్శకుడిగా రాజమౌళి పేరు ఇప్పుడు బ్రాండ్ అయిపోయింది. కాబట్టి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా… ఈ 3 నిమిషాల వీడియో ఈరోజు ఇండస్ట్రీనే కదిలించే స్థాయిలో ఉండబోతుందనే నమ్మకం ఫిక్స్.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి