టాలీవుడ్ లో సీనియర్ హీరోలలో బాలయ్య సక్సెస్ రేట్ ఎక్కువగా ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ ఏడాది అఖండ 2 సినిమాతో అభిమానులను అలరించడానికి సిద్ధమయ్యారు. ఈ విషయంపై అభిమానులు ఖుషీగానే ఉన్నప్పటికీ, బాలయ్య కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ పైన ఈ ఏడాది ఉంటుందని అభిమానులు ఎంతో ఆశపడినప్పటికీ నిరాశే కనిపిస్తోంది. ముఖ్యంగా ఈ డైరెక్టర్, ఆ డైరెక్టర్ అంటూ కొన్నేళ్లుగా ఏవో ఒక కథలు వినిపిస్తున్నాయి తప్ప, ఎంట్రీకి సంబంధించి ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు.


ఆ మధ్య హనుమాన్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞను లాంచ్ చేసే బాధ్యతలు తీసుకొని ఫస్ట్ లుక్ పోస్టర్ ని  విడుదల చేశారు. దీంతో సినిమా షూటింగ్ స్టార్ట్ అవుతుందనుకొనే సమయంలో కొన్ని కారణాల చేత ఆగిపోయినట్లు వినిపించాయి. దీంతో ఈ ఏడాది పాటు ఈ సినిమాని పక్కన పెట్టేసినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటివరకు మోక్షజ్ఞ సినిమా పైన అటు కుటుంబ సభ్యులు, ఇటు డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ఎలాంటి అప్డేట్ కూడా ఇవ్వడం లేదు. దీన్నిబట్టి చూస్తుంటే ఈ ఏడాది కూడా మోక్షజ్ఞ ఎంట్రీ కనిపించేది కష్టమే అనే విధంగా వినిపిస్తున్నాయి. కేవలం బాలయ్య సినిమాతోనే అభిమానులు సరిపెట్టుకునే పరిస్థితి ఉన్నది.


అంతేకాకుండా ప్రస్తుతం ఉన్న పరిస్థితులను బట్టి చూస్తూ ఉంటే అసలు మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా? అనే అనుమానాలు కూడా అభిమానులలో ఒక సందేహంగా కలుగుతోంది. కానీ గడిచిన కొద్ది రోజుల క్రితం హీరో నారా రోహిత్ మాత్రం మోక్షజ్ఞకు ఒక ఎమోషనల్ లవ్ స్టోరీ తో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వాలని ఉందని చెప్పారు.. బాలయ్య మాత్రం తాను డైరెక్షన్ చేయబోయే ఆదిత్య మ్యాక్స్ సినిమా ద్వారానే తన కుమారుడు పరిచయం చేస్తారంటూ ఆ మధ్య తెలిపారు. నవంబర్ 6 వ తేదీకి ఈ యేడాది 31లోకి అడుగు పెట్టారు మోక్షజ్ఞ. కానీ ఇప్పటివరకు ఎంట్రీ ఇవ్వలేదు.. మరి ఈ విషయంపై బాలయ్య ఎలా క్లారిటీ ఇస్తారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: