చాలామంది ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన మహేష్ బాబు రాజమౌళి ప్రాజెక్టుకు సంబంధించిన సినిమా టైటిల్స్ తో పాటు మహేష్ బాబు ఫస్ట్ లుక్ కూడా రివీల్ అయిపోయింది. వారణాసి అనే టైటిల్ ప్రకటించడంతోపాటు మహేష్ బాబు ఇందులో రుద్ర అనే పాత్ర చేస్తున్నట్టు కూడా ప్రకటించారు. అలాగే నందిపై కూర్చున్న శివుడిలా మహేష్ బాబు ఎద్దు పై కూర్చొని త్రిశూలం పట్టుకొని ఎంట్రీ ఇచ్చిన ఎంట్రీ సీన్ కి చాలామంది గూస్ బంప్స్ వచ్చాయి. అలాగే ఈవెంట్ కోసం కోసం రాజమౌళి ఆయన భార్య, కీరవాణి,కార్తికేయ ఆయన భార్య, మహేష్ బాబు, నమ్రత,సితార,నిర్మాత కేఎల్ నారాయణ,పృథ్వీరాజ్ సుకుమారన్ ఆయన భార్య, ప్రియాంక చోప్రా ఇలా ఎంతోమంది పాల్గొన్నారు. అలా అంగరంగ వైభవంగా జరిగిన ఈ ఈవెంట్ చూడ్డానికి రెండు కళ్ళు చాలవు. 

అలా కొంతమంది లైవ్ లో రామోజీ ఫిలిం సిటీ లో వీక్షించగా.. లక్షలాదిమంది జియో హాట్ స్టార్ లో లైవ్ చూశారు. ఇదిలా ఉంటే తాజాగా రాజమౌళి మరోసారి కాపీ చేశారు అంటూ ట్రోలింగ్ జరుగుతుంది. అదేంటంటే మహేష్ బాబు ఎద్దు మీద కూర్చొని ఉండే ఎంట్రీ సీన్ ఆ సినిమా నుండి జక్కన్న కాపీ చేసారంటూ ట్రోల్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక  ఆ సినిమా ఏంటంటే బెల్లంకొండ సాయి శ్రీనివాస్ నటించిన సాక్ష్యం.. ఈ సినిమా అందరూ చూసే ఉంటారు.

 ఈ సినిమాలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఎద్దు మీద కూర్చొని వచ్చే సీన్ ఒకటి ఉంటుంది.అయితే ఆ సీన్ చూసి కాపీ కొట్టి రాజమౌళి తన వారణాసి సినిమా కోసం మహేష్ బాబుని చూపించారంటూ ట్రోల్స్ చేస్తున్నారు. అయితే రాజమౌళికి ఈ ట్రోల్స్ అనేవి కొత్తేమీ కావు. ఆయన చేసిన ప్రతీ సినిమా సమయంలో ఎన్నో ట్రోల్స్ ఎదుర్కొన్నారు అంటూ రాజమౌళి అభిమానులు కౌంటర్ ఇస్తున్నారు

మరింత సమాచారం తెలుసుకోండి: