తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపును సంపాదించుకున్న యువ నటులలో రామ్ పోతినేని ఒకరు. ఈయన తన కెరీయర్లో నటించిన చాలా సినిమాలతో మంచి విజయాలను అందుకున్నాడు. ఈయన క్లాస్ రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ లతో మాత్రమే కాకుండా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ మూవీ లతో కూడా మంచి విజయాలను అందుకుని క్లాస్ , మాస్ ఆడియన్స్ లో తనకంటూ ఒక మంచి గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈ మధ్య కాలంలో రామ్ వరస పెట్టి మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీలతో ప్రేక్షకులను పలకరిస్తున్నాడు. 

అందులో భాగంగా ఈయన నటించిన ది వారియర్ , స్కంద , డబల్ ఇస్మార్ట్ సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టాయి. ఇలా వరుస అపజయాలతో డిలా పడిపోయిన రామ్ ప్రస్తుతం మహేష్ బాబు పి దర్శకత్వంలో రూపొందిన ఆంధ్ర కింగ్ తాలూకా అనే సినిమాలో హీరోగా నటించాడు. భాగ్య శ్రీ బోర్స్ ఈ సినిమాలో హీరోయిన్గా నటించింది. నవంబర్ 28 వ తేదీన ఈ సినిమాను విడుదల చేయనున్నారు. వరుస ప్లాప్ ల తర్వాత రామ్ నటించిన మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు ఉండవు అని చాలా మంది భావించారు. 

కానీ ప్రస్తుతం ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. ఇకపోతే బుక్ మై షో ప్లాట్ ఫామ్ లో ఈ మూవీ కి ప్రేక్షకుల నుండి రెస్పాన్స్ లభిస్తుంది. ఇప్పటివరకు ఈ సినిమాకు బుక్ మై షో లో 50 కే ఇంట్రెస్ట్ లు లభించాయి. ఈ విషయాన్ని ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటిస్తూ ఓ పోస్టర్ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతం ఆ పోస్టర్ వైరల్ అవుతుంది. మరి వరుస ఆపజయాలతో డీలా పడిపోయిన రామ్ "ఆంధ్ర కింగ్ తాలూకా" సినిమాతో ఏ స్థాయి విజయాన్ని అందుకుంటాడో తెలియాలి అంటే మరి కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: