సీనియర్ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి రాజశేఖర్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన చాలా సంవత్సరాల క్రితం నటుడిగా కెరియర్ను మొదలు పెట్టాడు. నటుడుగా కెరియర్ను మొదలు పెట్టిన తర్వాత ఈయన ఎన్నో మంచి విజయవంతమైన సినిమాల్లో హీరో గా నటించి టాలీవుడ్ ఇండస్ట్రీ లో తనకంటూ సూపర్ సాలిడ్ క్రేజ్ ను సంపాదించుకున్నాడు. దానితో ఈయన తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన క్రేజ్ కలిగిన హీరో గా చాలా సంవత్సరాల పాటు కెరియర్ను కొనసాగించాడు.

కానీ ఆ తర్వాత కాలంలో ఈయనకు ఆ స్థాయి విజయాలు దక్కక పోవడం తో ఈయన కెరియర్ చాలా వరకు డ్రాప్ అయ్యింది. ఈ మధ్య కాలంలో రాజశేఖర్ నటించిన చాలా సినిమాలు బాక్సా ఫీస్ దగ్గర ఫెయిల్యూర్ అయ్యాయి. ఆఖరుగా ఈయనకు గరుడ వేగ సినిమాతో విజయం దక్కింది. ఈ సినిమా తర్వాత రాజశేఖర్ అనేక మూవీ లలో హీరోగా నటించాడు. కానీ గరుడ వేగ స్థాయి విజయం మాత్రం ఆయనకు ఆ సినిమా తర్వాత దక్కలేదు. ప్రస్తుతం ఈయన శర్వానంద్ హీరో గా రూపొందుతున్న బైకర్ అనే సినిమాలో కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా ఈయన ఓ తమిళ రీమేక్ మూవీ లో నటించే అవకాశం ఉన్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

అసలు విషయం లోకి వెళితే ... కొంత కాలం క్రితం తమిళ్ లో లబ్బర్ పందు అనే సినిమా వచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ ని తెలుగు ప్రేక్షకుల ముందుకు కూడా తీసుకు వచ్చారు. ఈ మూవీ తెలుగు ప్రేక్షకులను కూడా బాగా ఆకట్టుకుంది. ఇకపోతే ఈ సినిమాను రాజశేఖర్ , రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో తెలుగు లో రీమేక్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నట్లు , ప్రస్తుతం అందుకు సంబంధించిన సంప్రదింపులు జరుగుతున్నట్లు ఓ వార్త ప్రస్తుతం వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: