నందమూరి నట సింహం బాలకృష్ణ కొంత కాలం క్రితం బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన అఖండ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్గా నటించగా ... శ్రీకాంత్ విలన్ పాత్రలో నటించాడు. ఈ మూవీ లో బానయ్య రెండు పాత్రలలో నటించి తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఈయన అందించిన సంగీతం కూడా ఈ సినిమా విజయంలో అత్యంత కీలక పాత్రను పోషించింది.

అద్భుతమైన విజయం సాధించిన అఖండ మూవీ కి కొనసాగింపుగా ప్రస్తుతం బోయపాటి శ్రీను , బాలకృష్ణ హీరోగా అఖండ 2 అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ సినిమాకు కూడా ఎస్ ఎస్ తమన్ సంగీతం అందిస్తూ ఉండడంతో ... ఈ మూవీ మ్యూజిక్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇది ఇలా ఉంటే అఖండ 2 మూవీ ని డిసెంబర్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఇప్పటికే ఈ మూవీ బృందం ఈ సినిమా ప్రమోషన్లను కూడా మొదలు పెట్టారు. ఈ మూవీ ని హిందీ లో కూడా విడుదల చేయనున్నారు. దానితో ఈ మూవీ బృందం ఇప్పటికే హిందీ లో కూడా ఈ సినిమా ప్రమోషన్లను మొదలు పెట్టింది. 

ఇకపోతే ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన నార్త్ ఇండియా హక్కులను కూడా ఈ మూవీ బృందం అమ్మి వేసింది. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను కూడా తాజాగా విడుదల చేసింది. ఈ మూవీ యొక్క నార్త్ ఇండియా థియేటర్ హక్కులను జీ స్టూడియోస్ సంస్థ దక్కించుకుంది. మరి నార్త్ ఇండియాలో ఈ సినిమా ఎలాంటి టాక్ ను తెచ్చుకొని ఏ రేంజ్ కలెక్షన్లను వసూలు చేస్తుందో తెలియాలి అంటే ఇంకా కొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే. ఏదేమైనా కూడా ప్రస్తుతానికి ఈ మూవీ పై తెలుగు ప్రేక్షకుల్లో మాత్రం మంచి అంచనాలు నెలకొని ఉన్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: