ఇటీవల ఏ విషయం జరిగినా రాజకీయ కోణం దానిలోకి చేరిపోవడం సాధారణం. అదే ఈ ప్రాజెక్ట్‌కూ వర్తించింది. కమల్ హాసన్ డీఎంకే మద్దతుదారు. మరోవైపు సుందర్ భార్య ఖుష్బూ బీజేపీ నాయకురాలు. ఈ కారణంగా రాజకీయ దూరాలు, ఆలోచనల భేదాలు సుందర్ వైదొలగడానికి కారణం అయి ఉంటాయన్న ఊహాగానాలు మొదలయ్యాయి. అయితే పరిశ్రమ వర్గాల అభిప్రాయం ప్రకారం ఈ లాజిక్ అంత బలంగా కనిపించడం లేదు. ఎందుకంటే రాజకీయ కోణం సమస్యైతే సినిమా ప్రకటనే వచ్చేదే కాదు. సోషల్ మీడియాలో మరో సెపరేట్ ట్రాక్ కూడా నడిచింది. ఈ సినిమాలో ఖుష్బూకి ఒక స్పెషల్ సాంగ్ ఆఫర్ చేశారని, ఆమె అంగీకరించకపోవడంతో సుందర్ ప్రాజెక్ట్ నుంచి తప్పుకున్నారన్న ట్రోలింగ్ మొదలైంది.
ఖుష్బూ స్వభావం ఏంటో తెలుసు… ఆమె ఇలాంటి కామెంట్స్‌ను పట్టించుకోదు. వెంటనే ఘాటైన కౌంటర్ ఇచ్చింది: “ నన్ను ఐటెమ్ సాంగ్ చేయమని ఎవరూ అడగలేదు. మీ ఇళ్లలో ఎవరినైనా అడిగారేమో చూసుకోండి ” అంటూ బోల్డ్ ట్వీట్ పెట్టి ట్రోల్స్‌కి చెక్ పెట్టింది. ఇక ఇండస్ట్రీలో ఎక్కువగా వినిపిస్తున్న టాక్ ప్రకారం స్క్రిప్ట్ విషయంలో ఏదో సమస్య వచ్చిందని. రజనీకాంత్, కమల్ ఇద్దరూ ఉన్న ప్రాజెక్ట్ కాబట్టి కథపై అధిక శ్రద్ధ అవసరం. ఆ రేంజ్‌లో సరైన స్క్రిప్ట్ లాక్ కాకపోవడంతో సుందర్ తప్పుకున్నారన్న అభిప్రాయం బలంగా వినిపిస్తోంది. ఏది ఏమైనా రజనీకాంత్ సినిమా తమిళనాట తిరుగులేని క్రేజ్. అలాంటి ప్రాజెక్ట్‌ను నిర్మాతగా కమల్ హాసన్ సెట్ చేయడం చిన్నపని కాదు. ఇప్పుడు కొత్త కథ, కొత్త దర్శకుడిని ఎంపిక చేసే ప్రక్రియ కొనసాగుతోంది. ఈ కాంబినేషన్ మీదున్న అంచనాలు ఎంతో పెద్దవి కాబట్టి, కమల్ తీసుకునే నిర్ణయం మీద కోలీవుడ్ మొత్తం కళ్లేసి ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి