సినిమా పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్ ఉందనేది బహిరంగ రహస్యం. ఈ చేదు నిజాన్ని ఎందరో స్టార్ హీరోయిన్లు సైతం చాలా సందర్భాలలో అంగీకరించారు. తాజాగా, తెలుగు సినీ పరిశ్రమలో ఈ చీకటి కోణంపై నటి దక్షి గుత్తికొండ సంచలన వ్యాఖ్యలు చేశారు, ఇది ప్రస్తుతం చర్చనీయాంశమైంది.

'కొత్త పోరడు' వెబ్ సిరీస్‌తో తెలుగు ప్రేక్షకులకు చేరువైన దక్షి గుత్తికొండ, సోషల్ మీడియాలో ఊహించని ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్నారు. ముఖ్యంగా ఆమె చేసిన బోల్డ్ ఫోటో షూట్స్ గురించి తరచూ చర్చ జరుగుతూ ఉంటుంది. ఈ ఫోటో షూట్స్ వెనుక ఉన్న అసలు కారణాలను ఆమె తాజాగా వెల్లడించారు.

దక్షి గుత్తికొండ మాట్లాడుతూ, "తెలుగమ్మాయిలు ఎక్స్‌పోజింగ్ చేయరు అనేది పూర్తిగా తప్పు. కథ డిమాండ్ చేస్తే, పాత్రకు అవసరమైతే మేము తప్పకుండా చేయగలం" అని ఆమె స్పష్టం చేశారు.

అంతేకాకుండా, "ఒక వ్యక్తి ధరించే దుస్తులను బట్టి వారి క్యారెక్టర్‌ను అంచనా వేయడం సరికాదు. దుస్తులు మన వ్యక్తిత్వాన్ని నిర్ణయించవు" అని ఆమె గట్టిగా చెప్పారు. బాల నటిగా ఇండస్ట్రీలోకి రావాలని ఆసక్తి ఉన్నా కొన్ని కారణాల వల్ల చేయలేకపోయానని, అయితే 'కరోనా వైరస్' సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమయ్యానని ఆమె తెలిపారు.

సినీ పరిశ్రమలో ఎదురయ్యే వేధింపుల గురించి ప్రస్తావిస్తూ, "ఎక్కడైనా అమ్మాయిలకు వేధింపులు ఉంటాయి. సినీ పరిశ్రమ దీనికి మినహాయింపు కాదు. కొంతమంది వ్యక్తులు అర్థరాత్రి 2 గంటలకు, 3 గంటలకు ఫోన్ చేసి, 'నాకేంటి?' అని నేరుగా అడిగేవారు" అని దక్షి గుత్తికొండ ఆవేదన వ్యక్తం చేశారు.

అలాగే, కొంతమంది హీరోయిన్లు స్కిన్ షో చేస్తే నాలుగైదు సినిమాల్లో ఛాన్స్‌లు కొట్టేస్తారని కూడా ఆమె చెప్పుకొచ్చారు. పరిశ్రమలో కొంతమంది అవకాశాల కోసం సులువు మార్గాలు ఎంచుకుంటున్నారని ఆమె పరోక్షంగా తెలిపారు.

మరోవైపు, దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి మాట్లాడుతూ, "ఆర్జీవీ చాలా మంచి వ్యక్తి" అని ఆమె కామెంట్లు చేశారు. దక్షి గుత్తికొండ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్‌పై మరోసారి చర్చకు దారి తీస్తున్నాయి. అవకాశాల కోసం వచ్చే కొత్త నటీమణులకు ఈ చీకటి కోణాలు సవాలుగా మారుతున్నాయి అనడంలో సందేహం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: