గత రెండు మూడు రోజుల నుంచి ఎక్కువగా వినిపిస్తున్న పేరు ఇమ్మడి రవి. ఐ బొమ్మ , బప్పం మరికొన్ని వెబ్సైట్లతో కొత్త సినిమాలను డిజిటల్ ప్రింటింగ్ తో పైరసీ చేసేవారు. ఇటీవల రెండు రోజుల క్రిందట హైదరాబాదులో పోలీసుల సైతం ఇమ్మడి రవిని పట్టుకున్నారు. కొన్నేళ్లపాటు ట్రై చేస్తూ ఉన్న దొరకని ఇమ్మడి రవి ఎట్టకేలకు శుక్రవారం రోజున తన భార్యకు విడాకుల వ్యవహారం వల్ల ఇమ్మడి రవి భార్య పోలీసులకు హైదరాబాద్ లో ఎక్కడ ఉన్నరనే ఇన్ఫర్మేషన్ అందించడంతో పట్టుకున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో బప్పం, ఐ బొమ్మ వంటి సైట్లను కూడా మూసివేయడం జరిగింది.



ముఖ్యంగా పోలీసులకే ఐ బొమ్మ గతంలో సవాల్ విసిరిన సంగతి అందరికీ తెలిసిందే.  ఈ విషయాన్ని సీరియస్గా తీసుకొని అధికారులు పట్టుకున్నామని చెబుతున్నారు. రవి అరెస్టు పైన పలు రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి కానీ సోషల్ మీడియా వేదికగా మాత్రం రవికి మద్దతుగా పలువురు నెటిజెన్స్ పోస్టులు కామెంట్స్ తో తెగ వైరల్ గా చేస్తున్నారు. టికెట్ల రేట్లు ఇష్టం వచ్చినట్లుగా పెంచుకుంటూ పోతే మధ్య తరగతి వారికి, సినిమా టికెట్లు ధరలు కొనలేని వారికి ఐ బొమ్మ వల్లే తాము సినిమాలను చూడగలుగుతున్నామని, ఐ బొమ్మ లేకపోతే ఈపాటికి టికెట్లు రేట్లు మరింత పెంచే వాళ్ళు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.


అంతేకాకుండా రవిని విడిచి పెట్టాలి అంటూ డిమాండ్ చేస్తూ పలు రకాల ట్విట్టర్లలో వైరల్ గా చేస్తున్నారు. నిజానికి ఇమ్మడి రవి వల్ల తెలుగు సినీ పరిశ్రమకు పెద్ద నష్టమే జరిగింది. సుమారుగా రూ .22 వేల కోట్ల రూపాయలు నష్టపోయినట్లు ఇప్పటివరకు వినిపిస్తున్నాయి. అయితే ఇప్పుడు అరెస్టు చేసిన ఇమ్మడి రవి కి ప్రేక్షకుల మద్దతు లభించడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం ఇమ్మడి రవికి 14 రోజులపాటు రిమాండ్ కోర్టు విధించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: