గత కొన్ని సంవత్సరాల నుంచి సినీ పరిశ్రమ వాళ్లకు చుక్కలు చూపిస్తున్నటువంటి ఐ బొమ్మ నిర్వాహకుడు రవిని ఎట్టకేలకు పోలీసులు పట్టుకున్నారు.. థియేటర్లోకి వచ్చినటువంటి సినిమాలు  కొన్ని గంటల్లోనే  పైరసీగా మార్చి ఐ బొమ్మ అనే సైట్ ద్వారా ప్రజలకు అందుబాటులోకి తీసుకువచ్చేవారు రవి. అయితే ఈయన్ని పట్టుకోవడానికి పోలీసులకు చాలా కష్టమైంది. చాలా టెక్నికల్ గా ఆ సైట్లో సినిమాని అప్లోడ్ చేసి కనీసం సైబర్ పోలీసులకు కూడా దొరికే వాడు కాదు. ఒకానొక సమయంలో పోలీసులకు కూడా రవి సవాలు విసిరాడు. దీంతో అతని కదలికలపై నిఘా పెట్టి ఉంచిన పోలీసులు చివరికి హైదరాబాదులో ఆయన్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. 

అయితే రవి దొరకడానికి కారణం తన భార్య అని తెలుస్తోంది. గత కొంతకాలంగా తన భార్యతో విభేదాలు ఉండడం వల్ల విడాకుల కోసం ఆయన హైదరాబాద్ వస్తున్నట్టు పోలీసులకు ఇన్ఫర్మేషన్ వెళ్ళింది. దీంతో కాపు కాసిన పోలీసులు ఆయనను పట్టుకున్నారు. అలాంటి ఐ బొమ్మ నిర్వాహకుడు రవి తండ్రి తాజాగా మీడియాతో మాట్లాడుతూ కొన్ని షాకింగ్ విషయాలు బయటపెట్టారు. నా కొడుకు పైరసీ చేస్తున్న విషయం నాకు అసలు తెలియదని తన తండ్రి చిన్న అప్పారావు తెలియజేశారు. నా కొడుకు రవి నేరం చేసాడని నాకు తెలియదు.. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తే నేరం చేసినట్టే అంగీకరించాల్సి వస్తుందేమో అనిపిస్తుందన్నాడు.

 నా కొడుకు మా ఇంటికి వచ్చి రెండు సంవత్సరాలు అవుతోంది.. పోలీసులకు సవాలు విసిరితే ఊరుకుంటారా. తాను చేసింది తప్పు. ఇలా సవాళ్లు విసరడం ఏంటంటూ మాట్లాడారు.. రవి ప్రేమించి వివాహం చేసుకున్నాడు. ఒక పాప కూడా పుట్టింది. భార్యాభర్తల మధ్య విభేదాలు ఉన్నాయి విడిపోయినట్టు కూడా తెలిసింది అంటూ తన తండ్రి వెల్లడించారు.. ఏది ఏమైనప్పటికీ రవి దొరికిపోవడంతో సినీ ఇండస్ట్రీ వాళ్ళు సంబరపడినా కానీ సామాన్యులు , రవి చేసింది తప్పే అయినా సామాన్యులకు అందుబాటులో సినిమా థియేటర్ ని అందించారంటూ సపోర్ట్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: