మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్ ఇప్పటివరకు కేవలం మలయాళ సినిమాలలో మాత్రమే కాకుండా అనేక ఇతర భాష సినిమాల్లో కూడా నటించి ఎన్నో విజయాలను అందుకొని ఇండియా వ్యాప్తంగా గుర్తింపును సంపాదించుకున్నాడు. ఈయన మలయాళం తర్వాత ఎక్కువ శాతం తెలుగు సినిమాల్లో నటించాడు. అందులో భాగంగా ఈయన తెలుగులో నటించిన మహానటి , సీత రామం , లక్కీ భాస్కర్ అనే మూడు సినిమాలతో కూడా మంచి విజయాలను అందుకున్నారు. తాజాగా ఈయన కాంత అనే సినిమాలో హీరో గా నటించాడు. ఇది తమిళ సినిమా. కానీ ఈ సినిమాలో రానా కూడా నటించడంతో మరో సారి తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర కాంత మూవీ తో దుల్కర్ సల్మాన్ విజయాన్ని అందుకుంటాడు అని చాలా మంది అనుకున్నారు. తెలుగు లో మంచి అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమాకు టాలీవుడ్ బాక్సా ఫీస్ దగ్గర కాస్త నెగిటివ్ టాక్ వచ్చింది. దానితో ఈ మూవీ కి పెద్ద స్థాయి కలెక్షన్లు రెండు తెలుగు రాష్ట్రాల్లో దక్కడం లేరు. ఇప్పటివరకు ఈ సినిమాకు సంబంధించిన రెండు రోజుల బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయింది. ఈ రెండు రోజుల్లో ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం.
 
2 రోజుల్లో ఈ సినిమాకు నైజాం ఏరియాలో 88 లక్షల కలెక్షన్లు దక్కగా , సీడెడ్ లో 12 లక్షలు , ఆంధ్ర లో 93 లక్షల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి2 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 1.93 కోట్ల షేర్ ... 3.60 కోట్ల గ్రాస్ కలెక్షన్లు దక్కాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ మూవీ 9.5 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్సా ఫీస్ బరిలోకి దిగింది. దానితో ఈ మూవీ మరో 7.5 కోట్ల షేర్ కలెక్షన్లను తెలుగు రాష్ట్రాల్లో సాధిస్తే హిట్ స్టేటస్ను అందుకుంటుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: