మెగా మేనల్లుడు సాయి దుర్గ తేజ్ తాజాగా తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి సాక్షిగా తన పెళ్లి డేట్ ని ప్రకటించారు. ఆయన నోటి నుండి ఈ మాట రావడంతోనే చాలామంది మెగా ఫ్యాన్స్ సంబరపడిపోతున్నారు. మరి ఇంతకీ సాయి దుర్గ తేజ్ పెళ్లి ఎప్పుడు అనేది ఇప్పుడు తెలుసుకుందాం.. మెగాస్టార్ చిరంజీవి సోదరి తనయుడు సాయి దుర్గ తేజ్.. మేనమామల బాటలోనే ఇండస్ట్రీలోకి హీరోగా ఎంట్రీ ఇచ్చారు. అలా పిల్లా నువ్వు లేని జీవితంతో సినిమాల్లోకి వచ్చిన ఈయన వరుస సినిమాల్లో చేస్తూ ఓ మోస్తరు హీరోగా పేరు తెచ్చుకున్నారు. ఇక ఆ మధ్యకాలంలో యాక్సిడెంట్ వల్ల కొద్దిరోజులు ఇంటికి పరిమితమైన సాయి దుర్గ తేజ్ విరూపాక్ష సినిమాతో మళ్ళీ కం బ్యాక్ ఇచ్చారు. ప్రస్తుతం సాయి దుర్గ తేజ్ సంబరాల ఏటిగట్టు అనే సినిమా చేస్తున్నారు.ఇదిలా ఉంటే తాజాగా ఈరోజు ఉదయం సాయి దుర్గ తేజ్ తిరుమల తిరుపతి దేవస్థానాన్ని దర్శించుకున్నారు.

ఈ నేపథ్యంలోనే సెలబ్రిటీలు వస్తే చాలామంది మీడియా వాళ్ళు వారి ఫోటోలు, వీడియోలు తీయడానికి పరుగులు పెడతారు. అలాగే ఎన్నో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు కూడా వేస్తారు. ఇందులో భాగంగా సాయి దుర్గ తేజ్ అక్కడి మీడియా వాళ్లతో తన పర్సనల్ విషయాన్ని షేర్ చేసుకున్నారు. వచ్చే ఏడాది నా పెళ్లి జరగబోతుంది అంటూ గుడ్ న్యూస్ చెప్పడంతో చాలామంది మెగా ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. అలా సాయి దుర్గ తేజ్ స్వయంగా తన నోటితో తానే వచ్చే ఏడాది పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పడంతో మెగా అభిమానుల ఆనందానికి అవధులు లేవు.

 అలాగే తన కొత్త సినిమా గురించి స్పందిస్తూ వచ్చే ఏడాది సంబరాలు ఏటిగట్టు అనే పాన్ ఇండియా మూవీతో మీ ముందుకు రాబోతున్నాను. ఈ సినిమా మీకు నచ్చుతుందని నాకు నమ్మకం ఉంది. నాకు మంచి మంచి సినిమాలు ఇస్తున్న దర్శకులకి,మంచి జీవితం ఇస్తున్న శ్రీవారికి కృతజ్ఞతలు తెలపడానికే తిరుమల వచ్చాను అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేశారు. అలా ఫైనల్ గా మెగా ఫ్యామిలీలో మరో పెళ్లి జరగబోతుందని మెగా ఫ్యామిలీలో పెళ్లి భాజాలు మోగబోతున్నాయని సాయి దుర్గ తేజ్ క్లారిటీ ఇచ్చారు..

మరింత సమాచారం తెలుసుకోండి: