టాలీవుడ్ యంగ్ ఎన‌ర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా తెరకెక్కుతున్న ‘ ఆంధ్ర కింగ్ తాలూకా ’ సినిమాకు సంబంధించిన కన్నడ ట్రైలర్ లాంచ్ కార్యక్రమం బెంగళూరులో గ్రాండ్ గా జరిగింది. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌పై నిర్మిస్తున్న ఈ సినిమా లో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ ఉపేంద్ర కీలక పాత్రలో కనిపించనున్నారు. ట్రైలర్‌కు ప్రేక్షకులు మంచి స్పందన వ‌స్తోంది. ఈ కార్యక్రమంలో మీడియాతో మాట్లాడిన మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాత రవిశంకర్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ఫిలిం నగర్‌లో హాట్ టాపిక్‌గా మారాయి. ఆయన మాట్లాడుతూ, తమ బ్యానర్ చేస్తున్న భారీ ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తూ డేరింగ్ స్టేట్‌మెంట్ ఇచ్చారు.


రిషబ్ శెట్టితో కలిసి ‘ జై హనుమాన్ ’  చేస్తున్నామని, ఇది కాంతారా తర్వాత ఆయన నుంచి రాబోయే తదుపరి చిత్రం అని రవిశంకర్ వెల్లడించారు. అదే సమయం లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ - ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రూపొందుతున్న భారీ యాక్షన్ డ్రామా కూడా ప్రస్తుతం షూటింగ్‌లో ఉందని తెలిపారు. ఈ చిత్రం 2026 మార్చిలో విడుదలవు తుంద‌ని క్లారిటీ చెప్పారు. అలాగే పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ 2026 ఏప్రిల్‌లో విడుదల అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని చెప్పారు. ఇక రెబల్ స్టార్ ప్రభాస్‌తో కలిసి చేస్తున్న ఫౌజీ కూడా పెద్ద స్కేల్‌పై రూపొందుతున్న మరో ప్రాజెక్ట్ అని పేర్కొన్నారు.


ఈ ప్రాజెక్టులన్నింటిపై పూర్తి నమ్మకంతో ఉన్నట్టు రవిశంకర్ మాట్లాడుతూ “ మేము చేస్తున్న ఐదు భారీ చిత్రాల్లో ఒక్కటి కూడా యావరేజ్ కాకపోతే, మీరు చెప్పిందే నేను చేస్తాను ” అంటూ ప్రేక్షకులు, మీడియాకు ఛాలెంజ్ విసిరారు. ఇప్పుడు ర‌విశంక‌ర్ ఇచ్చిన ఈ స్టేట్‌మెంట్ సినీ వర్గాల్లో పెద్ద చర్చకు దారితీసింది. మైత్రీ మూవీ మేకర్స్ ప్రస్తుతం భారీ పెట్టుబడులతో వరుస పాన్ ఇండియా ప్రాజెక్టులు చేస్తుండటంతో , 2026లో వారు వరుస సూపర్ హిట్లు అందిస్తారా ? అనే ఆసక్తి అభిమానుల్లో పెరిగింది.

మరింత సమాచారం తెలుసుకోండి: